సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఇద్దరు యూట్యూబర్‌ల అరెస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాల్లో వీడియోలు పోస్టు చేసిన ఇద్దరు య్యూట్యూబర్లను పోలీసులు అరెస్త్ చేశారు. కేసు వివరాలను సైబర్ క్రైమ్ అదనపు సీపీ విశ్వప్రసాద్ మీడియాకు వెల్లడించారు. 'నిప్పు కోడి' అనే ఎక్స్ హ్యాండిల్ సీఎంను తిడుతున్న వీడియో వైరల్‌గా మారిందని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కైలాష్ ఫిర్యాదు చేశారు.
పల్స్ టీవీకి చెందిన ఓ రిపోర్టర్ గుర్తు తెలియని వ్యక్తి ని ఇంటర్వ్యూ చేశారు. అందులో మాట్లాడిన వ్యక్తి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పల్స్ టీవీ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేయించిందని దర్యాప్తులో గుర్తించామని అదనపు సీపీ తెలిపారు. పల్స్ టీవలో వచ్చిన ఈ వీడియను 'నిప్పుకోడి' అనే ఎక్స్ హ్యాండిల్‌లో ట్రోల్ చేశారని చెప్పారు.

కేసు దర్యాప్తు చేసి ఆ టీవీ ఛానల్ సీఈవో జర్నలిస్టు రేవతితోపాటు పల్స్ టీవీ ప్రతినిధి బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. టీవీ కార్యాలయంలో సోదాలు నిర్వహించి రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు హార్డ్ డిస్క్‌లు, ఒక లోగో, ఒక రూటర్, 7 సీపీయూలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రేవతిపై గతంలో బంజారాహిల్స్ ఎల్బీనగర్‌లో కేసులు ఉన్నాయని అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు.
సోషల్ మీడియాను ఇష్టానుసారం ఉపయోగిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే పలు కేసులతో తేలింది. అయినా కొందరు మాత్రం సోషల్ మీడియాను ఉపయోగించి ప్రభుత్వ పెద్దలు, మహిళలు, చిన్నారులపై అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ కటకటాలపాలవుతున్నారు.












Click it and Unblock the Notifications