స్వాతంత్ర్య వేడుకలకు ముస్తాబైన గోల్కొండ కోట: మెరిసిపోయిన చార్మినార్
హైదరాబాద్: స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా నగరంలోని చారిత్రక కట్టడాలు గోల్కొండ కోట, చార్మినార్ సర్వంగా సుందరంగా ముస్తాబయ్యాయి. త్రివర్ణ పతాక రంగుల్లో విద్యుత్ దీపాలను అలంకరించారు. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన లైటింగ్ అందరినీ ఆకట్టుకుంది.
చార్మినార్ కట్టడంపై త్రివర్ణ పతాక రంగులతో కూడిన విద్యుత్ కాంతులతో మెరిసిపోతుండటంతో శనివారం రాత్రి నగర ప్రజలు భారీ ఎత్తున సందర్శించారు. విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న చార్మినార్ వద్ద ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలు పోస్టు చేశారు.

ఆదివారం(ఆగస్టు 15న) 75 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ క్రమంలో గోల్కొండ కోట వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
మరోవైపు, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ బందోబస్తు, గస్తీ నిర్వహిస్తున్నారు. గోల్కొండ కోటలోకి ప్రవేశించే ప్రతి ద్వారం దగ్గర డోర్ ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు తనిఖీలు చేయనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
The charminar makes for a glorious sight as its lit up in the tricolour to mark India’s 75th happy Independence. this song is evergreen for our nation jai hind jai bharat🇮🇳💙 #IndependenceDay #IndiaAt75 #स्वतंत्रतादिवस pic.twitter.com/RYpSkpFs3h
— Ayan Shah (@Sidaya1224) August 15, 2021
స్వాతంత్ర్య వేడుక నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఆదివారం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఆదివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కో ట వైపునకు వాహనాలకు అనుమతి లేదు.
రాందేవ్‌గూడ నుంచి కోటకు ఎ, బి, సి, పాస్ హోల్డర్స్ వాహనాలకే అనుమతి.
కింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం నుంచి వచ్చే పాస్ హోల్డర్లు రేతిబౌలి,నానల్‌నగర్ జంక్షన్ నుంచి లంగర్‌హౌస్ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్ బ్రిడ్జి, రాందేవ్‌గూడ జంక్షన్ మీదుగా రావాలి.
మక్కై దర్వాజ వద్ద ఎ- కారు పాస్ హోల్డర్లు మెయిన్ రోడ్డు పక్కన,
బి- పాస్ హోల్డర్లు గోల్కొండ కోట బస్టాప్ వద్ద,
సి- కారు పాస్ హోల్డర్లు గోల్కొండ బాయ్స్ గ్రౌండ్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో పార్క్ చేయాలి.
డి- పాస్ హోల్డర్లు ప్రియదర్శిని స్కూల్ వద్ద వాహనాలను పార్క్ చేయాలి.
ఇ- కారు పాస్ హోల్డర్లు సెవన్ టూంబ్స్ బంజారా దర్వాజ మీదుగా రేతిగల్లిలోని ఒౖవైసి గ్రౌండ్‌లో వాహనాలను పార్క్ చేయాలి.

Recommended Video
ఇక లంగర్‌హౌస్ మీదుగా వచ్చే ఇ- పాస్ హోల్డర్లు బడాబజార్, బల్దియా ఐలాండ్ మీదుగా ఒవైసి గ్రౌండ్‌కు వెళ్లాలి. ఎఫ్- కారు పార్క్ హోల్డర్లు లంగర్‌హౌస్ మీదుగా ఫతే దర్వాజ నుంచి హుడా పార్కు వద్ద వాహనాలను పార్క్ చేయాలి. షేక్‌పేట్, టోలిచౌకికి చెందిన వారు బంజారా దర్వాజ నుంచి ఆర్టీసి బస్సుల ద్వారా కోటకు చేరుకోవాలి. వేడుకలు పూర్తయిన తర్వాత ఏ,బీ,సీ- కారు పాస్ హోల్డర్లు మక్కై దర్వాజ, రాందేవ్‌గూడ, లంగర్‌హౌస్ నుంచి వెళ్లాలి. డి కారు పాస్ హోల్డర్లు బంజారదర్వాజ మీదుగా సెవన్ టూంబ్స్ వైపు వెళ్లాలి. ఇ- కారు పాస్ హోల్డరు బడాబజార్, ఫతే దర్వాజ గుండా వెళ్లాలి. ఎఫ్- కారు పాస్ హోల్డర్లు తమ తమ పార్కింగ్ ప్రదేశాల నుంచి వచ్చిన మార్గం గుండానే వెనక్కి వెళ్లిపోవాలి. అన్ని రకాల పాస్ హోల్డర్లు తమ పాస్‌ను తమ కారుపై డిస్‌ప్లే చేయాలి












Click it and Unblock the Notifications