అవినీతి ఎక్కువగా జరిగే ప్రభుత్వ శాఖ ఏదో తెలుసా..?
దేశంలో వేళ్లూనుకుపోయిన అవినీతిపై ఒక స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వే సంచలనం సృష్టిస్తోంది. ఈ సర్వేలో పాల్గొన్న లక్షలాది మంది పౌరుల్లో ఏకంగా 51 శాతం మంది తాము ఏదో ఒక ప్రభుత్వ సేవ కోసం లంచం చెల్లించినట్లు వెల్లడించారు. ఈ నివేదికలు పౌరుల ఫిర్యాదులు, లోక్‌పాల్ డేటా, ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ వంటి అధికారిక సోర్స్‌ల ఆధారంగా రూపొందించబడ్డాయి.ప్రధానంగా ప్రజలకు నిత్యం అవసరమయ్యే ప్రభుత్వ శాఖల్లోనే అవినీతి పతాక స్థాయిలో ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది.
భారతదేశంలో అత్యంత ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ శాఖల జాబితాలో పోలీస్ విభాగం అగ్రస్థానంలో నిలిచింది. ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఈ విభాగంపైనే అత్యధిక అవినీతి ఫిర్యాదులు అందడం ఆందోళన కలిగించే విషయం.

పోలీస్ శాఖ తర్వాత రెండవ స్థానంలో రెవెన్యూ శాఖ ఉంది. ఆస్తుల మార్పిడి విషయంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ముడుపుల లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నట్టు సర్వేలు తెలిపాయి. ఉదాహరణకు, తెలంగాణలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం 40 శాతం మంది లంచాలు చెల్లించారని తేలింది.
టాప్ 2 స్థానాల తర్వాత, ప్రజలు ఎక్కువగా అవినీతిని ఎదుర్కొంటున్న ఇతర ప్రభుత్వ విభాగాలు ఇవే..మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీ, బ్లాక్ ఆఫీసులు.. స్థానిక సంస్థల్లో పనులు జరగాలంటే లంచాలు ఇవ్వాల్సి వస్తోందని పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. విద్యుత్ శాఖ, రవాణా కార్యాలయం (ఆర్టీవో).ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య శాఖ, విద్యా శాఖ.నివాస, పట్టణాభివృద్ధి, ఆదాయ పన్ను (ఐటీ), జిఎస్‌టీ (GST) శాఖలు.
2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి 74,203 అవినీతి ఫిర్యాదులు అందాయి. ఇందులో రైల్వే ఉద్యోగులపై 10,447, స్థానిక సంస్థలు (మున్సిపల్ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు)పై 7,665, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులపై 7,004 ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఈ వివరాలన్నీ నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (NCIB), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) వంటి అధికారిక సంస్థల డేటా ఆధారంగా రూపొందించబడ్డాయి. ఏది ఏమైనా, అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వ శాఖల జాబితాలో పోలీస్ శాఖ మొదటి స్థానంలో, రెవెన్యూ శాఖ రెండవ స్థానంలో ఉండటం దేశంలో పాలన పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications