హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేగం పెరిగింది: సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయంలో కేంద్రమంత్రి జైశంకర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ సమాజం భద్రతకు సంబంధించిన సవాళ్లకు చాలా సున్నితంగా ఉంటుందని.. బహుశా దాని సమకాలీనుల కంటే ఎక్కువ, విస్తృత శ్రేణి సాంప్రదాయ, సాంప్రదాయేతర బెదిరింపులను ఎదుర్కొంటోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం అన్నారు. మంగళవారం హైదరాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాలకు హాజరైన ఆయన.. సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయాన్ని సందర్శించి అక్కడి సిబ్బందితో సమావేశమయ్యారు.

సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం సేవలు కీలకమని ఈ సందర్భంగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. సాంకేతికపరంగా, సిబ్బంది కొరత కారణంగా సమస్యలు ఎదురవుతున్నా ఎక్కువ గంటలు పనిచేస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. సరికొత్త ఆలోచనలతో పనులు వేగంగా చేస్తున్నారని, కార్యాలయం చూడముచ్చటగా ఉందని కొనియాడారు. సెలవు రోజున కార్యాలయానికి వచ్చినందుకు అభినందించారు.

 India faces conventional, non-conventional threats: EAM Jaishankar in Hyderabad

మరోసారి హైదరాబాద్ వచ్చినప్పుడు సిబ్బందితో ముచ్చటించే వీలుంటుందో లేదోనని.. అందుకే సెలవురోజున అందరినీ కలిసినట్లు కేంద్రమంత్రి జైశంకర్ తెలిపారు. సేవల రంగంలో గత 50 ఏళ్లలో దేశంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. పోస్ పోర్టు తీసుకోవాలంటే గతంలో ఏడాది వరకు వేచి ఉండేవారని, అనంతరం కొన్ని నెలలు.. ప్రస్తుతం కొద్ది రోజుల్లోనే ఇంటికొచ్చేస్తుందన్నారు. సాంకేతికత అభివృద్ధి, డిజిటలైజేషన్, డేటాబేస్ తదితరాలతో పోలీస్ వెరికేషన్, తత్కాల్ ప్రక్రియ వేగవంతమయ్యిందన్నారు. పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. కరోనా వైరస్ అనంతరం ఈ సంఖ్య మరింతగా పెరిగిందని చెప్పారు. కాగా, ఈ సందర్భంగా సిబ్బంది కేంద్రమంత్రితో ఫొటోలు దిగారు.

ఇది ఇలావుండగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 34వ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్మారక ఉపన్యాసాన్ని అందించారు కేంద్రమంత్రి జైశంకర్. భాహ్యంగా, అస్థిరమైన సరిహద్దులను భద్రపరచడం ఎల్లప్పుడూ ఖచ్చితమైన పని అని, ప్రస్తుత తరాలకు అనేక సంఘర్షణల ప్రత్యక్ష జ్ఞాపకాలు కూడా ఉన్నాయని అన్నారు.ఈ ప్రతి అంశానికి అర్థమయ్యేలా అప్‌గ్రేడ్ చేసిన ప్రతిస్పందన అవసరమని కేంద్ర మంత్రి అన్నారు.

Recommended Video

ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే *Politics | Telugu OneIndia

లా అండ్ ఆర్డర్ సమస్యలు, అంతర్గత భద్రత కూడా ఒక పెద్ద, బహుత్వ, వైవిధ్యమైన పాలిటీలో మరింత క్లిష్టంగా ఉన్నాయని, ఉగ్రవాదం గురించి ఆందోళనలు ముఖ్యంగా పదునైనవి.. ఎందుకంటే భారతదేశం తన సరిహద్దుల నుంచి ప్రాయోజిత హింసను ఎడతెగని హింసను అనుభవించింది అని అన్నారు. ఇవి మన పెరుగుతున్న ప్రపంచీకరణ ఉనికిలో పొందుపరచబడిన ముఖ్యమైన ఆందోళనలు కూడా ఉన్నాయన్నారు.

English summary
'India faces conventional, non-conventional threats': EAM Jaishankar in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X