Indian Railways: వెయిటింగ్ లేకుండా టికెట్ కన్ఫర్మ్.. ప్లాన్ అమలు చేస్తున్న రైల్వే!

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడం కోసం భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే వస్తుంది. ఇండియన్ రైల్వే భారతదేశంలో ప్రతిరోజు రైల్వే ద్వారా ప్రయాణం చేస్తున్న లక్షలాది మంది ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక సదుపాయాలను ఎప్పటికప్పుడు తీసుకువస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే వందలాది రైళ్లలో జనరల్ క్లాసు కోచ్ లను పెంచాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే కీలక నిర్ణయం
జనరల్ బోగీలలో సీట్ల కొరతను తగ్గించడం కోసం నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ కొత్త బోగీల సంఖ్యను పెంచుతున్నట్టు ప్రకటించింది. దీనిలో భాగంగా 370 కొత్త జనరల్ బోగీలను ఏర్పాటు చేయనుంది. ఇక ఈ ప్రక్రియ నవంబర్ నెలకి పూర్తవుతుందని రైల్వే బోర్డు తెలిపిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాబోయే రెండు సంవత్సరాలలో 10000 నాన్ ఏసీ కోచ్లను ప్రవేశపెట్టాలని రైల్వే ఆలోచిస్తోంది.

Indian Railways Railways says ticket confirmation without waiting with additional sleeper coaches

నాలుగు వేల స్లీపర్ కోచ్ ల సంఖ్య పెంచుతున్న రైల్వే
అంతేకాకుండా రైల్వే గత మూడు నెలల్లో అనేక రైళ్లలో సుమారు 600 జనరల్ క్లాసు కోచ్ లను జోడించింది. ఇది మాత్రమే కాకుండా స్లీపర్ కోచ్ ల సంఖ్యను కూడా భారీగానే పెంచుతుంది. దాదాపు నాలుగు వేల స్లీపర్ కోచ్ ల సంఖ్యను పెంచుతున్న క్రమంలో రైల్వే రిజర్వేషన్ చేసుకున్న వారికి రైల్వే తీసుకున్న నిర్ణయంతో లాంగ్ వెయిటింగ్ లిస్టు నుంచి ఉపశమనం లభిస్తుంది.

రిజర్వేషన్ చేసుకున్న వారికి లబ్ది
రిజర్వేషన్ కోసం ప్రయత్నించే ప్రయాణికులు బోగీల సంఖ్య పెంచడం కారణంగా లబ్ధిని పొందే అవకాశం ఉంది. టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా.. తమకు సీటు దొరుకుతుందా లేదా అనే ఆందోళన లేకుండా వెయిటింగ్ నుంచి ఇకపై పక్కాగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది.

ఇక పై టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వారికి నో వెయిటింగ్
నిత్యం రద్దీగా ఉండే రైళ్లలో 4000 స్లీపర్ కోచ్ ల సంఖ్యను పెంచిన కారణంగా ఇకపై రైల్వే టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వారు వెయిటింగ్ కష్టాలను పడాల్సిన అవసరం లేదని, కచ్చితంగా టికెట్ కన్ఫర్మ్ అవుతుందని భావిస్తున్నారు ఏది ఏమైనా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రైల్వే తీసుకుంటున్న అనేక నిర్ణయాలు అన్ని వర్గాల ప్రయాణికులకు గరిష్ట సౌకర్యాలను కల్పించేందుకు దోహదం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+