ఫీజు పెంపు మన సాఫ్ట్‌వేర్ కంపెనీలకు దెబ్బనే: మోహన్ రెడ్డి

హైదరాబాద్: హెచ్1బీ, ఎల్1 వీసాపై ప్రత్యేక ఫీజు పెంపు దేశీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఐటీ రంగ మండలి నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజ్ అసోసియేషన్(హైసియా) సిల్వర్ జూబ్లీ ఉత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

హెచ్1బీ, ఎల్1 వీసా ఫీజులను రెండింతలు పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం రక్షణాత్మక చర్యలకు నిదర్శమని అంటూనే అది దేశీయ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ఇప్పటికీ అమెరికాలో నిపుణులకు కొరత ఉందని, ముఖ్యంగా స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్) విభాగాల్లో చాలా మంది నిపుణులు అవసరమని ఆయన అన్నారు.

Indian softaware companies will suffer with the decission: Mohan Reddy

వీసా ఫీజు పెంపుతో కలిగే ప్రతికూల పరిణామాలపై యూఎస్‌కు చెందిన పలు ఫోరమ్‌లపై ఇప్పటికే ఇండస్ట్రీ ఆవేదన వ్యక్తం చేసిందని మోహన్ రెడ్డి చెప్పారు. భారత ఐటి పరిశ్రమల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీగా ప్రయోజనం కలిగిందని, ఇప్పు అలాంటి కంపెనీలనే దెబ్బ తీసే విధంగా నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.

అత్యున్నత నిపుణులు అవసమరమైన అమెరికన్ కంపెనీలను ఈ నిబంధన దోచుకోనుందని గురువారం విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో నాస్కామ్ పేర్కొంది. చాలా వరకు అమెరికా కంపెనీలు ఐటీ కార్యకలాపాలను విదేశాలకు తరలించాల్సి రావచ్చని అభిప్రాయపడింది. ఫలితంగా అమెరికాలో ఉద్యోగాల కల్పనపై ప్రభావం పడనుందని, ప్రభుత్వానికి పన్ను ఆదాయం తగ్గవచ్చని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+