ఇండియాలో టాప్-5 హైస్పీడ్ రైళ్లు ఇవే
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నెట్ వర్క్ ఉన్న రైల్వేల్లో నాలుగోస్థానాన్ని సంపాదించింది భారతీయ రైల్వే. అతి త్వరలోనే మొదటిస్థానానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు, అత్యాధునిక సౌకర్యాలక కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే రైళ్లు నడిచే వేగాన్ని పెంచుతూ వస్తోంది. గతంలో 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ప్రయాణికులకు అదే పెద్ద పండగలా ఉండేది. ఇప్పుడు మాత్రం కనీసం 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. వందేభారత్ రైళ్లు వచ్చిన తర్వాత ఇతర రైళ్ల వేగం కూడా పెరిగింది.
గంటకు 160 కిలోమీటర్ల వేగంతో
ఈ వేగాన్ని తట్టుకునేలా ట్రాక్స్ నిర్మాణం జరుగుతోంది. కనీసం 180 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా రూపొందిస్తున్నారు. త్వరలోనే విశాఖపట్నం నుంచి శంషాబాద్ కు, కర్నూలుకు 220 కిలోమీటర్ల వేగంతో నడిచేలా సెమీ హైస్పీడ్ రైల్వే లైన్ రాబోతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రైళ్లల్లో అత్యధిక వేగంతో ప్రయాణించే రైళ్లు ఐదు ఉన్నాయి. ఢిల్లీ నుంచి భోపాల్ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా ప్రసిద్ధికెక్కింది. ఇది గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ భద్రతను దృష్టిలో ఉంచుకొని 160 కిలోమీటర్ల వేగానికి పరిమితం చేశారు.

ఉచితంగా ఆహారాన్నిస్తారు
టాప్-2లో హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఆగ్రా వరకు నడుస్తున్న రైలు రెండోస్థానంలో నిలిచింది. ఢిల్లీ నుంచి ఆగ్రా మార్గంలో నడుస్తోంది. ఈ రైలులో కేవలం రెండు గంటల్లో ఆగ్రా వెళ్లిపోవచ్చు. రైలులో ఉచితంగా వైఫై అందిస్తారు. టాప్-3లో న్యూఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వరకు నడుస్తున్న శతాబ్ది ఎక్స్ ప్రెస్ నిలిచింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలులో ప్రయాణికులకు ఆహారాన్ని ఉచితంగా అందిస్తారు. పూర్తి ఏసీ రైలు.
గంటకు 140 కిలోమీటర్ల వేగంతో
టాప్-4లో ఢిల్లీ నుంచి ముంబయి మధ్య నడిచే రాజధాని ఎక్స్ ప్రెస్ నిలిచింది. ఈ రైలు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే నాలుగో రైలుగా పేరు సంపాదించుకుంది. ఇందులో ప్రయాణికులకు ఉచితంగా టీ, కాఫీ, ఐస్ క్రీం, మంచినీళ్ల సీసా అందిస్తారు. దేశం మొత్తం మీద అత్యంత శుభ్రంగా ఉండే రైలు ఇదే. టాప్-5లో న్యూఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్ లోని సీల్దా జంక్షన్ మధ్య నడిచే రైలు నిలిచింది. ఈ రైలు గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలులో కూడా ప్రయాణికులకు ఉచితంగా టీ, కాఫీ, స్నాక్స్ అందిస్తారు. ఇవి కాకుండా దేశంలోని పలు నగరాల మధ్య నడుస్తున్న వందేభారత్ రైళ్లు కూడా గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి.












Click it and Unblock the Notifications