ఇందిరమ్మ ఇళ్ళ బిల్లులకోసం ఎదురుచూసే వారికి శుభవార్త.. నేడు వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు!
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణం కోసం ప్రభుత్వం 5లక్షల రూపాయలు ఆర్ధిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేసుకున్న లభ్దిదారులకు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక శుభవార్త చెప్పారు. విడుదల చేసిన ప్రకటనలో కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల చివరి బిల్లులు చెల్లించడం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ళ చివరి బిల్లులో కేంద్రం వాటా
ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉన్న అర్హులైన వారికి ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందుతోంది. ఈ మొత్తాన్ని నాలుగు దశల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే అనేక ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయినా మూడు బిల్లులు మాత్రమేఇవ్వటం జరిగింది. చివరి బిల్లులో కేంద్ర వాటా కూడా ఉండటంతో ఆలస్యం జరుగుతోంది.

చివరి బిల్ కోసం ఎదురుచూస్తున్న వారికి మంత్రి శుభవార్త
ఈ క్రమంలో చివరి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి పొంగులేటి శుభవార్త చెప్పారు: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రావాల్సిన కేంద్ర వాటా కోసం దాదాపు ఏడాది కాలం ఎదురుచూశాం. ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు చివరి బిల్లులు మంజూరు చేస్తామన్నారు.
నేడు లబ్దిదారుల ఖాతాలో రూ.185 కోట్లు విడుదల
ఈ సంవత్సరం మార్చి 31 నాటికి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు చివరి బిల్లు కింద మొత్తం రూ.185 కోట్లు విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నిధులు నేడు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. మిగిలిన లబ్ధిదారులకు దశలవారీగా చెల్లింపులు కొనసాగుతాయని కూడా స్పష్టం చేశారు.అలాగే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సెప్టెంబరు 15 నాటికి పూర్తి చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్
దీనితో మరిన్ని కుటుంబాలు ఈ పథకం ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడనుంది. ఇంతకు ముందు హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది. 14 నియోజకవర్గాల్లో 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 40 వేల మందిని అర్హులుగా గుర్తించారు. నియోజకవర్గానికి 400 ఇళ్లు చొప్పున కేటాయించనున్నారు. ఆగస్టు 28 నుంచి 31 వరకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు.













Click it and Unblock the Notifications