ఇందిరమ్మ ఇళ్ల స్కాంపై వివరాలు ఇవ్వాలని లేఖ: త్వరలో సీఐడీ ఛార్జీషీట్
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంపై త్వరలో సీఐడీ ఛార్జీషీట్ దాఖలు చేయనుంది. ఇందిరమ్మ ఇళ్ల బోగస్ వ్యవహారంపై నిగ్గు తేల్చాలని విజిలెన్స్‌కు సీఐడీ లేఖ రాసింది. ఇందిరమ్మ ఇళ్లను ఎప్పుడెప్పుడు నిర్మించారన్న దానిపై పూర్తి స్పష్టత ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి నివేదిక రాగానే సీఐడీ ఛార్జీషీట్ దాఖలు చేయనుంది. గతంలో 9 జిల్లాల్లో శాంపిల్స్ కింద సీఐడీ దర్యాఫ్తు చేసింది. 36 గ్రామాల్లో 3వేల ఇళ్ల నిర్మాణంలో గోల్ మాల్ జరిగినట్లుగా విచారణ అధికారులు గుర్తించారు. రూ.11 కోట్ల నిధులు పక్కదారి పట్టినట్లు సీఐడీ తేల్చింది.

ఇటీవల కేసీఆర్ పలు కేసులపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం పోలీసు అధికారులతో సమావేశమై కేసులపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో ఓటుకు నోటు అంశం అందరిలోను నానింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సీఐడీ లేఖ రాయడం గమనార్హం.
గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications