మహిళలకు ఉచిత కుట్టుమిషన్ల పథకం..అప్లై చేసుకోవటానికి డెడ్ లైన్ ఇదే!
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి, మహిళా ఆర్ధికాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది.రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలనే సంకల్పంతో తెలంగాణా సర్కార్ మహిళలకు అనేక పథకాలు అందిస్తుంది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో బీసీ మహిళల ఆర్థిక సాధికారత కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
మహిళలకు ఉచితంగా ఆటోమేటిక్ కుట్టుమిషన్లు
ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ద్వారా అర్హులైన మహిళలకు ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందిస్తున్నారు. ప్రతి మిషన్ విలువ సుమారు పన్నెండు వేల రూపాయలు. ప్రభుత్వం పూర్తి సబ్సిడీ అందిస్తోంది కాబట్టి లబ్ధిదారులు ఏ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. కుట్టు మిషన్ లు ఇవ్వటం మాత్రమే కాదు మహిళలకు కుట్టు శిక్షణ కూడా ఇవ్వానున్నారు.

నిరుద్యోగ బీసీ మహిళల కోసం కొత్త పథకం
ఈ పథకాన్ని బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ బీసీ కార్పొరేషన్ అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ బీసీ మహిళలు దీని ద్వారా లబ్ది పొందవచ్చు. అర్హత కోసం వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ఒకటిన్నర లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలు మించకుండా ఆదాయం ఉన్న మహిళలు ఈ పథకం పొందటానికి అర్హులు.
అప్లై చేసుకోవాలంటే ఇలా చెయ్యండి
ఈ స్కీమ్ ద్వారా లబ్ది పొందాలనుకునేవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం వంటి పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. అధికారిక పోర్టల్ https://tgobmms.cgg.gov.in/ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 15 తేదీ లోపు దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
సెప్టెంబర్ 15 డెడ్ లైన్
ఎంపికైనవారికి జిల్లా స్థాయి అధికారుల ద్వారా మిషన్లు పంపిణీ చేస్తారు. మహిళలు స్వయం ఉపాధి సాధించి కుటుంబ ఆదాయం పెంచుకోవడానికి ఈ పథకం మంచి అవకాశం ఇస్తుంది. గడువు ముగిసేలోపు అర్హులైనవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. సెప్టెంబర్ 15 డెడ్ లైన్ ను మర్చిపోవద్దని చెప్తోంది తెలంగాణా సర్కార్.













Click it and Unblock the Notifications