రేవంత్‌కు ఇంద్రకరణ్ రెడ్డి సవాల్: నిరూపిస్తే.. రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా!
రేవంత్ తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్ చేశారు.
నిజామాబాద్: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తనపై చేసిన అవినీతి ఆరోపణలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తిప్పికొట్టారు. అవినీతి ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.
కాగా, ప్రభుత్వ-ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో గృహ నిర్మాణశాఖ చేపట్టిన జాయింట్ వెంచర్స్ లోమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

రేవంత్ చేసిన ఈ ఆరోపణల పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీడియా ముందు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. అవినీతి ఆరోపణలను నిరూపించగలిగితే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని అన్నారు. చంద్రబాబుకు తొత్తుగా పనిచేసే రేవంత్ రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
అయితే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమేనని ఇంద్రకరణ్ రెడ్డి అంగీకరించారు. మిషన్ భగీరథ పథకం వల్ల ఈ ఆలస్యం జరుగుతుందని, ఇకనుంచి అలాంటి సమస్య ఉండబోదని వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications