రాహుల్‌ గాంధీది దిగుమతి యాత్ర: ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీది దిగుమతి పాదయాత్ర అని తెలంగాణ దేవాదాయ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రాహుల్‌గాంధీ పాదయాత్రలో స్థానికులెవరూ లేరని అన్నారు. ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకున్నవారే పాదయాత్రలో ఉన్నారని అన్నారు. పాదయాత్రను వేలం ద్వారా నిర్మల్‌లో ఏర్పాటు చేసుకున్నారు.

రైతుల ఆత్మహత్యలకు కారణం గత పదేళ్లుగా పాలించిన కాంగ్రెస్ పార్టీనేనన్నారు. శుక్రవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర జిల్లాల నుంచి వచ్చినవారే రాహుల్ గాంధీ పాదయాత్రలో ఉన్నారని ఆయన అన్నారు.

 Indrakaran Reddy refutes Rahul Gandhi's pada yatra

తెలంగాణలో రాహుల్ పాదయాత్రపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ది పనికిమాలిన యాత్ర అని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు.

గతంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో అక్కర్లేని యాత్రలు చేశారని ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధన్యతనిస్తుందని ఉద్ఘాటించారు. ఆయన శుక్రవారంనాడు మహబూబ్‌నగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+