ఇవాంక పర్యటన: గాలిపైనా నిఘా, పరిశ్రమల పొగపై కత్తి

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా వాతావరణం పొగతో కలుషితం కాకుండా చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలపై నిఘా ఏర్పాటు చేశారు.

Recommended Video

    GES 2017 Hyderabad Specialities : focusing on women Entrepreneurs

    ఆమె రాక సందర్భంగా బిచ్చగాళ్లను పంపించి వేసిన విషయం తెలిసిందే. దోమల బెడద లేకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు. హైదరాబాదులో ఆమె కోసం స్వచ్చమైన గాలిని కూడా ఖాయం చేస్తున్నారు. వారం రోజుల పాటు పరిశ్రమలపై ఆంక్షలు విధించారు.

    Industries were monitered during Ivanka's Hyderbad visit

    హద్దూపద్దు లేకుండా పొగ వదిలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు పరిశ్రమల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు సమాచారం.

    ఐడిఎ బొల్లారం పారిశ్రామికవాడ నుంచి పొగ వెలువడకుండా చూసే బాధ్యతను కాలుష్య నియంత్రణ మండలి భుజాన వేసుకుంది. పాశమైలారం పారిశ్రామికవాడలో పిసిసి టాస్క్‌ఫోర్స్ పనిచేస్తోంది. ఇరవై నాలుగు గంటలు పారిశ్రామికవాడలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+