వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదిమానవుల ఆనవాళ్లు: కుబేరాలయం (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదిమానవుల ఆనవాళ్లు బయపడుతున్నాయి. హైదరాబాద్, శ్రీశైలం రహదారిలో కల్వకుర్తి దాటిన తర్వాత తిమ్మాయిపల్లి పంచాయతీ పరిధిలో గుహాలయంలో ఆదిమానవులు తలదాచుకున్న ఆనవాళ్లు బయటపడ్డాయి.

తిమ్మాయిపల్లి పంచాయతీ పరిధిలోని కమాల్‌పురా తండా సమీపంలోని చెన్నయ్యగుట్టపై గల గుహాలయంలో ఆదిమానవులు తలదాచుకున్నట్లు ఉన్న ఆనవాళ్లను జిల్లాకు చెందిన పరిశోధకుడు ద్యావనపల్లి సత్యనారాయణ గుర్తించారు.

ఆలయ శిఖర ప్రాంతం చదునుగా, నివాసయోగ్యంగా ఉంది. పురాతన ఆవాసపు ఆనవాళ్లు, రోళ్లు కనిపిస్తున్నాయి. గుట్ట అంచున తూర్పునకు అభిముఖంగా ఆలయం, స్తంభాల మండపం ఉన్నాయి.

ఆదిమానవుడి ఆనవాళ్లు..

ఆదిమానవుడి ఆనవాళ్లు..

స్తంభాలు, గుండుపై ఉన్న క్రీ.శ. 17వ శతాబ్ది నాటి శాసనంలో నరహరి ఒక రాజ్యపు మంత్రి అని, అతని కుమారుడు కుమారుడు చెన్నమయ్య కుబేరాలయం కట్టించాడని ఉంది.

ఆదిమానవుడి ఆనవాళ్లు...

ఆదిమానవుడి ఆనవాళ్లు...

చెన్నయ్యగుట్టపై పురాతన కుబేరాలయం బయటపడింది. ఏరువ రాజుల రాజధాని ఎల్లేశ్వరం పేర ఎల్లేశకుంట చెరువు కూడా ఉంది.

ఆదిమానవుడి ఆనవాళ్లు..

ఆదిమానవుడి ఆనవాళ్లు..

ఆలయంలోని కుబేరుని విగ్రహం తలను దుండగులవరో ధ్వంసం చేసారు.

ఆదిమానవుడి ఆనవాళ్లు...

ఆదిమానవుడి ఆనవాళ్లు...

ఇక్కడికి దగ్గరలోనే చెన్నమరాజులు కట్టించిన కోటగోడలు, ఆవాసపు ఆనవాళ్లు ఉన్నాయని సత్యనారాయణ చెప్పారు.

అదిమానవుడి ఆనవాళ్లు...

అదిమానవుడి ఆనవాళ్లు...

పురావస్తు శాఖ తవ్వకాలు జరిపితే విలువైన చరిత్ర బయటకు వస్తుందని సత్యనారాయణ చెప్పారు

ఆదిమానవుడి ఆనవాళ్లు

ఆదిమానవుడి ఆనవాళ్లు

ఇక్కడి గుట్టలు, లోయలు, చెన్నమయ్య గుడి వెనక ఉన్న కొలను, చెరువులు -ఇవన్నీ కలిసి అడ్వెంచర్ పర్యాటకానికి అనువుగా, రాజధానికి కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి

English summary
A rare inscription found in an inaccessible temple in a forest inMahabubnagar dist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X