పురుగులు పట్టిన సెలైన్ ఎక్కించడంతో.. బాలికకు సీరియస్
పేదల చికిత్సాలయం గాంధీ ఆసుపత్రిలో పురుగులు పట్టిన సెలైన్ ఎక్కిచండంతో ఓ బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించింది.
హైదరాబాద్: పేదల చికిత్సాలయం గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యమో.. వైద్యుల అలసత్వమో గానీ మొత్తానికి చికిత్స కోసం వచ్చిన ఓ ఆరేళ్ల చిన్నారికి పురుగులు పట్టిన సెలైన్ బాటిల్ ఎక్కించారు.

పురుగులు పట్టిన సెలైన్ ఎక్కిచండంతో బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వైద్య సిబ్బందిని నిలదీశారు. అయినా వారి నుంచి అదే నిర్లక్ష్య వైఖరి వ్యక్తం కావడంతో.. ఆసుపత్రి సూపరిండెంట్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. కార్యాలయంలో ఆయన అందుబాటులో లేరు.
వైద్యుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలను తీసుకుని తమ కుమార్తె ప్రాణాలను కాపాడాలని వారు వేడుకుంటున్నారు.
సూపరిండెంట్ స్పందన:
విషయం తెలుసుకున్న సూపరిండెంట్ మసూద్ దీనిపై స్పందించారు. పురుగు వచ్చిన సెలైన్ బాటిల్ ను ల్యాబ్ కు పంపించామన్నారు. దీనిపై టీఎస్ఎండీసీసీకి ఫిర్యాదు చేశామని, నిర్లక్ష్యంగా వ ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని సూపరిండెంట్ తెలిపారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు.












Click it and Unblock the Notifications