హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దృష్టి మరల్చి దోపిడీలు, జల్సాలు: చెన్నై గ్యాంగ్ అరెస్ట్, భారీగా సొత్తు స్వాధీనం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దృష్టి మళ్లించి నగదు, బంగారం చోరీలకు పాల్పడుతున్న చెన్నై ముఠాను రాంగోపాల్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో మొత్తం 11 కేసులకు పాల్పడి రూ. లక్షల్లో బ్యాంక్‌ల వద్ద అమాయకుల నగదును దోచుకున్నారు. ఈ మేరకు సెంట్రల్ జోన్ డీసీపీ కమలహాసన్‌రెడ్డి బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

చెన్నై ప్రాంతానికి చెందిన రత్నాకుమార్, గోపీసుందర్ రాజ్, పురుషోత్తం ప్రభు, కుంచాల అమర్‌నాథ్ ముఠాగా ఏర్పడ్డారు. పోలీసులకు అనుమానం రాకుండా వీరందరూ కొండాపూర్‌లోని బాలాజీ క్యాపీటల్ అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ నెం.404ను అద్దెకు తీసుకున్నారు.

గత అగస్టు నుంచి అక్టోబరు వరకు దృష్టి మళ్లించి దోచుకున్న 11 కేసుల్లో ఈ ముఠా సభ్యులు నిందితులుగా ఉన్నారు. అక్టోబరు 19వ తేదీన రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారి దృష్టి మళ్లించి 2.38 లక్షలు చోరీ చేశారని రాంగోపాల్ పేట్ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్‌లో ఏర్పాటు చేసిన దాదాపు 60 సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు సేకరించారు.

దీంట్లో పోలీసులకు మొదట అనుమానితుల బైక్ నెంబర్ దొరికింది. వాహనం రిజిస్ట్రేషన్ నెంబరు ఆధారంగా ఆ వాహనాలను ఓఎల్‌ఎక్స్ డాట్.కామ్‌లో కొనుగోలు చేశారని గుర్తించి.. యజమానులను విచారించారు. వారు ఇచ్చిన సమాచారంతో దుండగులు ఆచూకీ లభించింది.

దీని ఆధారంగా గోపీసుందర్, పురుషోత్తం ప్రభు, అమర్‌నాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ నిందితులు 11 కేసుల మిస్టరీని విప్పారు. కాగా, ఈ ముఠా నాయకుడు రత్నాకుమార్ పరారీలో ఉన్నాడు. అరస్టైన వీరి నుంచి పోలీసులు 5 లక్షలు విలువ చేసే చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నారు.

చోరీ సొత్తుతో ఈ దుండగులు అత్యంత ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ జల్సా చేస్తున్నారు. ఒక అటెన్షన్ డైర్షన్ చేస్తే లక్షలు వస్తుండడంతో దుండగులు పోలీసులను తప్పించుకునేందుకు విమానాల్లో తిరుగుతున్నారు.

చెన్నై గ్యాంగ్ అరెస్ట్

చెన్నై గ్యాంగ్ అరెస్ట్

దృష్టి మళ్లించి నగదు, బంగారం చోరీలకు పాల్పడుతున్న చెన్నై ముఠాను రాంగోపాల్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు.

చెన్నై గ్యాంగ్ అరెస్ట్

చెన్నై గ్యాంగ్ అరెస్ట్

ఈ గ్యాంగ్ హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో మొత్తం 11 కేసులకు పాల్పడి రూ. లక్షల్లో బ్యాంక్‌ల వద్ద అమాయకుల నగదును దోచుకున్నారు. ఈ మేరకు సెంట్రల్ జోన్ డీసీపీ కమలహాసన్‌రెడ్డి బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

చెన్నై గ్యాంగ్ అరెస్ట్

చెన్నై గ్యాంగ్ అరెస్ట్

చెన్నై ప్రాంతానికి చెందిన రత్నాకుమార్, గోపీసుందర్ రాజ్, పురుషోత్తం ప్రభు, కుంచాల అమర్‌నాథ్ ముఠాగా ఏర్పడ్డారు.

చెన్నై గ్యాంగ్ అరెస్ట్

చెన్నై గ్యాంగ్ అరెస్ట్

పోలీసులకు అనుమానం రాకుండా వీరందరూ కొండాపూర్‌లోని బాలాజీ క్యాపీటల్ అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ నెం.404ను అద్దెకు తీసుకున్నారు.

చెన్నై గ్యాంగ్ అరెస్ట్

చెన్నై గ్యాంగ్ అరెస్ట్

గత అగస్టు నుంచి అక్టోబరు వరకు దృష్టి మళ్లించి దోచుకున్న 11 కేసుల్లో ఈ ముఠా సభ్యులు నిందితులుగా ఉన్నారు.

వరుస కేసులు చేసిన తర్వాత దండగులు విమానంలోనే వారి సొంత గ్రామాలకు వెళ్లి వస్తుంటారు. వారిపై ఎవరీకి అనుమానం రాకుండా ఉండేందుకు సంపన్నులు ఉండే కొండాపూర్ బాలాజీ క్యాపీటల్ అపార్ట్‌మెంట్‌లో నెలకు రూ. 25 వేల అద్దె చెల్లిస్తున్నారంటే చోరీ సొత్తును ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో స్పష్టమవుతోంది.

దృష్టి మళ్లించి నేరాలకు పాల్పడే ఈ గ్యాంగ్ వారి పెట్టుబడిగా ఓ స్క్రూ డ్రైవర్, దురద పౌడర్ డబ్బాను వాడుతున్నారు. వీటి ద్వారా చేసే ఒక అటెన్షన్ డైవర్షన్ కేసులో నిందితులు లక్షలు కొల్లగొడుతారు.

ఎక్కడైన డబ్బుతో ఉన్న వ్యక్తి ఆగగానే ఈ ముఠాలోని ఇద్దరు మొదట స్క్రూ డ్రైవర్‌తో వాహనం టైరును పంక్చర్ చేస్తారు. అందులో ఒక్కరు సార్ మీ షర్టు మీద ఎదో పురుగులు తిరుగుతున్నాయని నమ్మిస్తూ అతడి మీద దురద పౌడర్‌ను చల్లుతారు. అతను దురద పెడతుందని దృష్టి మళ్లించగానే దండగులు నగదును ఎత్తుకెళ్లిపోతారు.

ఇది ఇలా ఉండగా, ఈ ముఠా నాయకుడు రత్నాకుమార్ తన బంధువైన అమర్‌నాథ్‌కు నెలకు రూ. 50 వేల జీతాన్ని ఇస్తూ నేరాలు చేయిస్తున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన అమర్‌నాథ్ టాటూలు వేయడంలో శిక్షణ పొందాడు. కానీ, రత్నాకుమార్ ఆఫర్‌తో అటెన్షన్ డ్రైవర్షన్ గ్యాంగ్‌లో చేరిపోయాడు.

అదేవిధంగా మిగతా నిందితులకు కూడా రత్నాకుమార్ భారీ కమీషన్లను ఆశ చూపి వారితో నేరాలు చేయిస్తున్నాడని పోలీసు విచారణలో తేలింది. ఇలా గ్యాంగ్‌గా ఏర్పడి కొద్ది రోజుల కిందట సాఫ్ట్‌వేర్ ఉద్యోగులమంటూ కొండాపూర్ ప్రాంతంలో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
Ramgopalpet police on Wednesday busted a three-member inter-state attention diversion gang and seized Rs 5 lakh worth property from their possession.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X