ఇంటర్ విద్యార్థిని సాయి ప్రజ్వల అదృశ్యం, ఆ లేఖలో ఏం రాసిందంటే?
ఇంటర్ విద్యార్థిని సాయి ప్రజ్వల లేఖ రాసి అదృశ్యమైంది. ఈ నెల 11వ, తేదిన కాలేజీకి వెళ్తున్నానని వెళ్ళిన సాయి ప్రజ్వల తిరిగి ఇంటికి రాలేదు. తీవ్రమైన ఒత్తిడి ఉందని సాయి ప్రజ్వల లేఖ రాసింది. ప్రజ్వల తల్లి
హైదరాబాద్: కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిడి కొనసాగుతోంది.ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఇంటర్ విద్యార్థిని సాయి ప్రజ్వల లేఖ రాసి అదృశ్యమైంది. ఈ నెల 11వ, తేదిన కాలేజీకి వెళ్తున్నానని వెళ్ళిన సాయి ప్రజ్వల తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితులు, బంధువుల ఇండ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు.సాయి ప్రజ్వల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైద్రాబాద్ నగరంలోని ఓ కార్పోరేట్ కాలేజీలో సాయి ప్రజ్వల ఇంటర్ చదువుతోంది.ఈ నెల 11న బండ్లగూడలోని కాలేజీకి వెళ్లిన సాయి ప్రజ్వల తిరిగి ఇంటికి రాలేదు.

చదువుకోవడం ఇష్టం లేక, వాళ్లు పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేకే తాను వెళ్లి పోతున్నట్లు ప్రజ్వల లేఖలో పేర్కొంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఉద్దేశించి లేఖలో రాసిన ప్రజ్వల కళాశాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, సాయి ప్రజ్వల ఇంటి నుంచి కళాశాలకు అని చెప్పి వెళ్తున్న సీసీటీవీ ఫుటేజిని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సారీ డాడీ, సారీ మమ్మీ, ఐ మిస్ యూ సో మచ్. బై అక్క. వేస్ట్ కాలేజ్. దే ఆర్ కిల్లింగ్ ది స్టూడెంట్స్ టూ రీడ్. సో ప్లీజ్ హెల్ప్ ది స్టూడెంట్స్ అంటూ లేఖ రాసి ఇంట్లోంచీ వెళ్లిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఇంటి నుంచి బయలు దేరిన తరువాత సాయి ప్రజ్వల ఎటు వెళ్లిందన్న విషయాన్ని సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications