సీఎం రేవంత్ - కేసీఆర్ మధ్య అసెంబ్లీలో ఊహించని పరిణామం, సభ్యులంతా సైలెన్స్..!!

తెలంగాణ అసెంబ్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చాలా కాలం తరువాత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల అంశాల పైన కేసీఆర్ - రేవంత్ మధ్య కొద్ది రోజులుగా డైలాగ్ వార్ సాగుతోంది. దీంతో, అసెంబ్లీ వేదికగా ఈ అంశాల పైన చర్చించేందుకు ఇద్దరు నేతలు సిద్దమయ్యారు. ఈ సమయం లో సభకు కేసీఆర్ రావటం.. అటు ప్రభుత్వం చర్చకు సిద్దమైంది. కాగా, సమావేశాల తొలి రోజు రేవంత్ - కేసీఆర్ జరిగిన ఆసక్తి కర పరిణామం పైన చర్చ కొనసాగుతోంది.

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు (సోమవారం) ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే మాజీ ఎమ్మెల్యే ఆర్ దామోదర రెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మృతికి శాసనసభ సంతాపం తెలియజేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతాప తీర్మానాలను సభలో చదివి వినిపించారు. మాజీ ఎమ్మెల్యేల ఆత్మకు శాంతి చేకూరాంటూ సభలో సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కాగా.. సమావేశాల్లో పాల్గొనేందుకు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సభలోకి రాగానే ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేసీఆర్ కూర్చున్న సీటు దగ్గరకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి...మంత్రులు పలకరించారు. కేసీఆర్ ఆరోగ్య విషయంపై ఆరా తీసారు.

interesting-development-between-cm-revanth-and-kcr-in-telangana-assembly

అసెంబ్లీ ప్రారంభం కాగానే ఈ సన్నివేశం చోటు చేసుకుంది. సమావేశాలకు ప్రారంభం కాగానే జాతీయ గీతం ఆలపించారు. సభకు వచ్చిన కేసీఆర్ ను సీఎం.. మంత్రులు పరామర్శ వేళ అన్ని పార్టీల సభ్యులు ఆసక్తి గా గమనించారు. అటెండెన్స్ లో సంతకం చేసిన కేసీఆర్.. ఆ తరువాత సభలోకి వచ్చారు. జాతీయగీతం పూర్తవగానే సభనుంచి కేసీఆర్ వెళ్లిపోయారు. ఇక.. ఈ రోజున బీఏసీ జరగనుంది. సమావేశాల నిర్వహణ.. అజెండా పైనా నిర్ణయం తీసుకోనున్నారు. కేసీఆర్ ఈ రోజు హాజరైన వెంటనే వెళ్లిపోవటంతో... మిగిలిన రోజులు సభకు హాజరవుతారా లేదా అనేది సందేహంగా మారుతోంది. కాగా.. సమావేశాల్లో సాగునీళ్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నీటి కేటాయింపులు, ప్రాజెక్టులు తదితర అంశాలపై సభలో కూడా చర్చ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని వివరాలను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై సభలో ప్రభుత్వం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్టు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+