మార్కుల భయానికి విద్యార్థిని బలి: బిటెక్ విద్యార్థి ఆత్మహత్య, ప్రేమే కారణమా?

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌లో మార్కులు తక్కువ వస్తాయన్న భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్లుకు చెందిన పెద్దయ్య గత కొద్ది సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ సరూర్‌నగర్‌ జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నాడు.

ఆయన కూతురు శ్రీజ(16) దిల్‌సుఖ్‌నగర్‌లోగల ఓ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవ త్సరం చదువుతోంది. త్వరలో పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. ఈ స్థితిలో మార్కులు తక్కువ వస్తాయని శ్రీజ మనస్తాపం చెందింది. బుధవారం ఉదయం 6గంటల సమ యంలో అపార్ట్‌మెంట్‌ 4వ అంతస్థు పై నుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయ పడిన ఆమెను గ్లోబల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

Intermediate girl student commits suicide in telangana

అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి. మార్కులు తక్కువ వస్తే నా ముఖాన్ని మీకు చూపించలేనంటూ శ్రీజ సూసైడ్‌ నోట్‌ రాసింది. తాను చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేయాలని కోరింది. కుమార్తె చివరి కోరిక మేరకు తల్లిదండ్రులు శ్రీజ అవయవాలు దానం చేశారు. వాసన్‌ ఐకేర్‌ ఆస్పత్రి వారు ఆమె కళ్లు సేకరించారు.

బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి బుధవారం రంగారెడ్డి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూరు మండలం సువదరశాల గ్రామానికి చెందిన చెపాల బాల్‌రెడ్డి, లక్ష్మీ దంపతుల ఒక్కగానొ క్క కూమారుడు దినేశ్‌ రెడ్డి(19) కీసర మండలం భోగారం గ్రామంలోని హోలీమేరీ ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్‌లో ఉంటూ బీటెక్‌ ఈసీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

మంగళవారం రాత్రి వరకు స్నేహితులతో మాట్లాడిన దినేశ్‌ రెడ్డి బుధవారం హాస్టల్‌ వెనుక నిర్మానుష్యమైన ప్రదేశంలో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. హాస్టల్‌ నిర్వాహకులు, స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కేసు దర్యాప్తు చేస్తున్న ట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు. అయితే, దినేశ్‌ రెడ్డి ఆత్మహత్యకు కళాశాల వేధింపులే కారణమని స్థానికులు ఆరోపిస్తుండగా, ప్రేమ వైఫల్యమే ఆత్మహత్యకు కారణమని కళాశాల యాజమాన్యం చెబుతోంది. హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థులను అధిక ఫీజులు చెల్లించాలని కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని, దీంతోనే దినేశ్‌ రెడ్డి ఆత్మహత్య కు పాల్పడినట్లు ప్రజాప్రతినిధులు అంటున్నారు.

దినేశ్‌ రెడ్డికి మామ వరుసయ్యే వ్యక్తి ఆదిలాబాద్‌లో ఉండేవాడని, అతని కూతురుతో దినేశ్‌ రెడ్డి ప్రేమలో పడ్డాడని తెలిపారు. కొంతకాలం క్రితం దినేశ్‌ రెడ్డి మామ చనిపోయాడని, అప్పటి నుంచి అతని కూతురుని దినేశ్‌ రెడ్డితో ఫోన్లో మాట్లాడనివ్వకపోవడం వల్ల మనస్థాపానికి గురైనట్లు అధ్యాపకులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+