బండి సంజయ్ కు చెప్పకుండానే - టీ బీజేపీలో ఏం జరుగుతోంది..!?

తెలంగాణ బీజేపీలో అంతర్గత రాజకీయం వేడెక్కింది. బండి సంజయ్ కు తెలియకుండానే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేతల మధ్య సమన్యయ కొరవడింది. తెలంగాణ బీజేపీలోకి కొత్త నేతల చేరిక పై పార్టీ హైకమాండ్ స్పష్టమైన దిశా నిర్దేశం చేసింది. మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. పొంగులేటితో చర్చల కోసం బీజేపీ నేతల టీం సమావేశం కానుంది. దీని పైన బండి సంజయ్ కు సమాచారం లేదు. స్వయంగా ఆయనే ఈ విషయం వెల్లడించారు.

బండికి సమాచారం లేకుండానే : కొంత కాలంగా తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కో ఆర్డినేషన్ లేదనే వార్తలు మొదలయ్యాయి. ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో పార్టీలో చేరికల పైన ప్రత్యేకంగా శ్రద్ద చూపాలని పార్టీ నాయకత్వం సూచించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటిని బీజేపీకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటిలో లంచ్ మీటింగ్‌కు నేతలు హాజరుకానున్నారు.

 bandi

ఇప్పటికే పలుమార్లు బీజేపీ చేరికల కమిటీ నేతలు పొంగులేటిని కలిశారు. ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందనరావు మరికొందరు బీజేపీ నాయకులు నేడు పొంగులేటిని తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. పొంగులేటి పార్టీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే పొంగులేటి బీజేపీలో చేరటం దాదాపు ఖాయమని భావిస్తున్నారు.

చేరికలపై ఈటల నిర్ణయాలు : అయితే, బీజేపీ నేతలు పొంగులేటితో సమావేశం పైన తనకు సమాచారం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని సంజయ్ పేర్కొన్నారు. కుటుంబ పాలన పోవాలంటే బీజేపీ రావాలన్నారు. పొంగులేటితో ఈటల బృందం భేటీ విషయమై తనకు సమాచారం లేదన్నారు. తనకు చెప్పకపోవటం తప్పేమీ కాదన్నారు. పార్టీలో ఎవరి పనులు వారు చేసుకుంటూ వెళ్తారన్నారు.

bandi-sanjay-kumar

తనకు తెలిసిన వారితో తాను.. ఈటలకు తెలిసిన వారితో ఆయన మాట్లాడుతున్నారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. దీని ద్వారా ప్రచారం సాగుతున్నట్లుగా బీజేపీ ముఖ్య నేతల మధ్య ఐక్యత లేదనే మరోసారి తెర మీదకు వచ్చింది. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పొంగులేటి బీజేపీలో చేరుతారని అంటున్నారు. కర్ణాటక ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసి బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.

తెలంగాణ బీజేపీలో కొత్త వివాదం : బండి సంజయ్ తనకు సమాచారం లేదని చెప్పటం పైన ఇప్పుడు ఈట రాజేందర్ ఏ రకంగా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. ఈటల రాజేందర్ కు బీజేపీలోకి ముఖ్యుల చేరికల బాధ్యతలను పార్టీ నాయకత్వం అప్పగించింది. అయితే, బండి సంజయ్ తనకు సమాచారం లేదనటంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. పొంగులేటితో పాటుగా మాజీ మంత్రి జూపల్లితోనూ బీజేపీలోకి ఆహ్వానించటం పైన చర్చలు సాగుతున్నాయి. జూపల్లి దాదాపుగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇక, ఈ రోజు జరిగే చర్చల్లో పొంగులేటిని కూడా ఒప్పించి ఇద్దిరీనీ బీజేపీలోకి చేర్చుకొనేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+