హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Alert: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ మార్పు, 28 నుంచే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శంషాబాద్‌ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికుల డిపార్చర్స్​ కోసం ఏర్పాటు చేసిన టెర్మినల్​ ఇకపై మూతపడనుంది. నవంబర్ 28 మధ్యాహ్నం నుంచి ఆ టెర్మినల్‌​ను మూసివేస్తున్నట్లు జీహెచ్​ఐఏఎల్​ అధికారులు ప్రకటించారు.

అంతేగాక, అంతర్జాతీయ డిపార్చర్ టెర్మినల్ తిరిగి ప్రధాన టెర్మినల్‌కు మారిందని, కొత్త డిపార్చర్ హాల్ నవంబర్ 28, మధ్యాహ్నం 1 గంట నుంచి పనిచేస్తుందని జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. దీని గురించి ప్రయాణికులకు తెలియజేయాలని విమానయాన సంస్థలను ఆదేశించింది.

 International departures at Hyderabad airport to be shifted to main terminal from 28th

మొదటి అంతర్జాతీయ విమానం SV-753 కొత్త డిపార్చర్ హాల్ నుంచి సాయంత్రం 5.30 గంటలకు టేకాఫ్ అవుతుంది, ఈ కొత్త అంతర్జాతీయ డిపార్చర్ హాల్ ప్రారంభంతో, ప్రస్తుత ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్ (ఐఐడీటీ) రద్దు చేయబడుతుంది. ప్రయాణీకులు మార్పును గమనించి, ఏదైనా తదుపరి సమాచారం కోసం విమానాశ్రయ వెబ్‌సైట్ www.hyderabad.aeroని సందర్శించాలని లేదా విమానాశ్రయ సమాచార డెస్క్‌ని +91-40-66546370లో సంప్రదించాలని సూచించారు.

విమానాశ్రయంలోని అన్ని ప్యాసింజర్ టచ్ పాయింట్లలో సమాచార వ్యాప్తికి విమానాశ్రయం తగిన ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా కమ్యూనికేషన్ జరుగుతోందని శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

English summary
International departures at Hyderabad airport to be shifted to main terminal from 28th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X