అంతర్జాతీయ రాకెట్: కిడ్నీ అమ్ముకుని జల్సాలు చేశాడు, ఏజెంట్‌గా మారాడు
నల్లగొండ: ఓ యువకుడు రూ. 5 లక్షలకు కిడ్నీ అమ్ముకుని ఆ డబ్బుతో జల్సాలు చేశాడు. దాంతో ఆగకుండా మరింత మందిని ఆ దిశగా ముందుకు నడిపించాడు. నల్లగొండ జిల్లాలో అంతర్జాతీయ స్థాయిలో కిడ్నీలను విక్రయిస్తూ క్యాష్ చేసుకున్న కిడ్నీ రాకెట్ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు.
బుధవారం రాత్రి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఆ రాకెట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నల్లగొండకు చెందిన కస్పరాజు సురేశ్ హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తూ జల్సాలకు అలవాటు పడి 2014లో వెబ్‌సైట్‌లో చూసి తన కిడ్నీని శ్రీలంకలోని కొలంబోలో రూ.5 లక్షలకు అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడు.

అనంతరం సురేశ్ కిడ్నీ రాకెట్‌కు ప్రధాన ఏజెంట్‌గా మారి జిల్లా కు చెందిన అబ్దుల్ హపీజ్, పాలెం మహేశ్, కొత్తపల్లి నరేశ్‌తోపాటు గుజరాత్, మహారాష్ట్ర , తమిళనాడులకు చెందిన మరో 11 మంది కిడ్నీలను రూ.5 లక్షల చొప్పున కొలంబోలో విక్రయించాడు. కిడ్నీలు అమ్ముకున్న 15 మందిలో నలుగురిని అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు.
ముఠా సభ్యు ల నుంచి మూడు పాస్‌పోర్టులు, కారు, బైక్, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. ఒక్కో కిడ్నీకి సురేశ్ అడ్వాన్స్‌గా రూ.25 వేలు తీసుకుని, కిడ్నీ విక్రయించిన తర్వాత రూ.50వేలు తీసుకుంటాడని ఎస్పీ వివరించారు.
రక్త విభాగాన్ని బట్టి ఒక్కో కిడ్నీకి రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందన్నారు. కిడ్నీ ఇచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తారని ఎస్పీ వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications