సిటీలో ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్: నిర్వాహకులు, ఢిల్లీ, రష్యా యువతుల అరెస్ట్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలో మరో భారీ అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. రష్యాతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి.. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ వ్యభిచార ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పాత నేరస్తులు తమ వృత్తిని మానుకోకుండా ఖరీదైన ఇళ్లను అద్దెకు తీసుకొని ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.

 విలాసంతమైన జీవితం..

విలాసంతమైన జీవితం..

డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం...చెన్నైకి చెందిన కురెయిన్ తారయెల్ జాకబ్ అలియాస్ అలెక్స్ 15 ఏండ్ల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి రెంటల్(అద్దె) వ్యాపారాన్ని నిర్వహించాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన అతడికి.. ఆ వ్యాపారంలో వచ్చే డబ్బు సరిపోలేదు. దీంతో అనంతపురంకు చెందిన చెన్నైలో నివాసముండే రాఘవేందర్‌రెడ్డి అలియాస్ రఘువీర్‌రెడ్డితో పరిచయం అయ్యింది.

 2011 నుంచే సెక్స్ రాకెట్..

2011 నుంచే సెక్స్ రాకెట్..

వీరిద్దరూ కలిసి 2011లో హైదరాబాద్ బంజారాహిల్స్‌లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ పట్టుబడ్డారు. అలెక్స్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన రెంటల్ వ్యాపారాన్ని కొన్ని రోజులు కొనసాగించాడు. ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యామల మేరి, బీహార్‌కు చెందిన పంకజ్‌కుమార్ మండల్‌తో కలిసి బంజారాహిల్స్ ఫార్చూన్ హోటల్ సమీపంలో దుర్గా ఎన్‌క్లేవ్‌లో రూ. 30 వేలకు ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు.

 ఈసారి అంతర్జాతీయ స్థాయిలో..

ఈసారి అంతర్జాతీయ స్థాయిలో..

మనదేశంలోని ఢిల్లీ, ముంబై(మహారాష్ట్ర', కోల్‌కతా(పశ్చిమబెంగాల్)తోపాటు ముంబై, కోల్‌కతాతో పాటు రష్యా, ఉజ్బెకిస్థాన్ తదితర ప్రాంతాల నుంచి యువతులను రోజుకు రూ. 16 వేలు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకొని హైదరాబాద్‌కు తీసుకొస్తారు. ఇలా హైఫైగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ వచ్చే విటుల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తుంటారు.

పట్టుబడ్డ నిర్వాహకులు, యువతులు

పట్టుబడ్డ నిర్వాహకులు, యువతులు

కాగా, యామల మేరి, పంకజ్‌కుమార్ మండల్‌లు విటులను వ్యభిచార గృహానికి రప్పించే పనులు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లు బృందం ఆ వ్యభిచార గృహంపై ఆకస్మిక దాడి చేశారు. నిర్వాహకులు అలెక్స్, మేరి, పంకజ్ అరెస్ట్ చేసి, రష్యా, కోల్‌కతా, ఢిల్లీకి చెందిన ముగ్గురు యువతులను రెస్క్యూ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 40 వేల నగదు, కండోమ్స్, పాస్‌పోర్టు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసున్నారు. తదుపరి విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Taskforce police busted an international sex racket and arrested three persons operating brothels from a house in upmarket Banjara Hills. Police rescued three women, including an Uzbekistan national.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి