తెలంగాణకు శుభవార్త చెప్పిన మోదీ, దశ తిరిగినట్టే
రైల్వేలకు కేటాయింపులతో కూడిన కేంద్ర బడ్జెట్‌ను 01 ఫిబ్రవరి 2025 న పార్లమెంట్‌లో సమర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే, సమాచార & ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, న్యూఢిల్లీ నుండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపుల ముఖ్యాంశాలపై మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ 2025-2026 సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో రూ.5,337 కోట్ల బడ్జెట్ కేటాయింపులు మంజూరు అయ్యాయని తెలియజేశారు. 2009-14 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వార్షిక సగటు బడ్జెట్ వ్యయం రూ. 886 కోట్లు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు 2009-14 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రానికి జరిగిన సగటు కేటాయింపులతో పోలిస్తే దాదాపు ఆరు రెట్లు పెరిగిందని తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రంలో వివిధ రైలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రూ. 41,677 పెట్టుబడి పెడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే నెట్‌వర్క్ ఇప్పుడు 100% విద్యుదీకరణ చెందిందని మంత్రి తెలియజేశారు. కవచ్ ఏర్పాటులో తెలంగాణ ముందంజలో ఉందని, కవచ్ అభివృద్ధి కేంద్రం సికింద్రాబాద్‌లో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ విభాగాలలో 1,465 కిలోమీటర్ల మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటుచేయబడింది. కవచ్ తాజా వెర్షన్ 4.0 ఏర్పాటుకు ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన అన్నారు. రాబోయే 6 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం రైలు నెట్‌వర్క్‌లో కవచ్‌ను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు .
తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాల గుండా తొమ్మిది స్టాప్‌లతో 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇంకా, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 50 కొత్త నమో భారత్ రైళ్లు, 200 వందే భారత్ రైళ్లు, 100 కొత్త అమృత్ భారత్ రైళ్లకు ఆమోదం లభించిందని, ఈ రైళ్ల రాకపోకలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని ఆయన ప్రకటించారు. రైల్వేలు7,000 కిలోమీటర్ల మేర పాత ట్రాక్‌లను పునరుద్ధరించాలనే లక్ష్యాన్ని చేపట్టాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమైన విభాగాలలో 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపడానికి భారతీయ రైల్వేలు రైల్వే ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా, కొన్ని మార్గాలు 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని మరియు మొత్తం నెట్‌వర్క్ 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications