IPS RS Praveen Kumar :అనూహ్య నిర్ణయం-పదవికి రాజీనామా-తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం..?
తెలంగాణలో ప్రముఖ ఐపీఎస్ అధికారి,సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరేళ్ల సర్వీసు ఉండగానే స్వచ్చంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఐపీఎస్ అధికారిగా,గురుకులాల కార్యదర్శిగా తనదైన ముద్ర వేసి... తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు ప్రవీణ్ కుమార్. పదవికి రాజీనామా చేసిన వేళ... తన భవిష్యత్ అడుగులు రాజకీయాల్లోకే అని చెప్పకనే చెప్పేశారు. బహుజన మహనీయులు పూలే,బాబా సాహెబ్ అంబేడ్కర్,కాన్షీరాం బాటలో నడిచేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రవీణ్ మరో సంచలనానికి తెరలేపనున్నారా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో హుజురాబాద్ ఉపఎన్నిక ముంగిట్లో ఆయన రాజీనామా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఐపీఎస్ ప్రవీణ్ రాజీనామా లేఖలో వ్యాఖ్యలు...
వ్యక్తిగత కారణాల వల్ల ఇంకా ఆరేళ్ల సర్వీసు ఉండగానే పదవి విరమణ చేయాల్సి రావడం బాధ కలిగిస్తోందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అదే సమయంలో ఎట్టకేలకు ఇక ఎటువంటి పరిమితులు లేకుండా... తన మనసుకు ఇష్టమైన పనులు,తనకు నచ్చిన రీతిలో చేయబోతున్నందుకు ఆనందం,ఉత్సాహం కలుగుతోందని... అది తనకు కొత్త శక్తిని ఇస్తోందని అన్నారు. పోలీస్ అధికారిగా తన సేవలకు మంచి గుర్తింపు పొందిన తాను... పేద ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దివంగత ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ గారి బాటలో నడిచానని తెలిపారు.పదవీ విరమణ తర్వాత తన శేష జీవితమంతా మహానీయుల పూలే,అంబేడ్కర్,కాన్షీరాం బాటలో పీడితులకు అండగా,భావితరాలను ఒక కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. తన కొత్త ప్రయాణానికి అందరి దీవెనలు కావాలని ఆకాంక్షించారు.

రాజకీయాల్లోకి ఐపీఎస్ ప్రవీణ్...
ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ తన రాజీనామా లేఖలో పేర్కొన్న చివరి వాక్యాలను గమనిస్తే... తెలంగాణలో బహుజన రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో భవిష్యత్‌లో ఆయన కార్యాచరణ ఉండొచ్చునేమో అన్న స్పృహ కలుగుతోంది. ఇందుకోసం ఆయన మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరి... దక్షిణాదిలో ఆ పార్టీని నిలబెట్టే మిషన్ చేపడుతారేమోనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేదా బహుజన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రవీణ్ కొత్త పార్టీ పెట్టవచ్చునన్న ఊహాగానాలు కూడా లేకపోలేదు.

హుజురాబాద్' ఉపఎన్నిక ముంగిట్లో...
తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నిక ముంగిట్లో ప్రవీణ్ రాజీనామా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థుల అంచనాలకు ఏమాత్రం అందకుండా నిర్ణయాలు తీసుకోవడంలో ధిట్ట అయిన కేసీఆర్... ఈసారి హుజురాబాద్‌లో ప్రవీణ్ రూపంలో తమ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాల్లో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న ప్రవీణ్‌ను హుజురాబాద్ బరిలో దింపడం ద్వారా ఈటలను సునాయాసంగా చిత్తు చేయవచ్చునని కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేసి ఉండొచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఐపీఎస్ ప్రవీణ్‌కు స్వయానా బావ అయిన,వికారాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో మాట్లాడి ఆయన్ను ఒప్పించే ప్రయత్నం జరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మరో ఆసక్తికర విషయం... ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత సాధికార పథకం అమలు కార్యక్రమాన్ని ఆయనకు అప్పగించవచ్చునేమో అన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఈ పథకానికి సంబంధించి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రవీణ్ హాజరుకాకపోవడం గమనార్హం.

క్లారిటీ ఇచ్చిన స్వేరోస్...
మరోవైపు ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నాయి.హుజురాబాద్ ఉపఎన్నికకు ఐపీఎస్ ప్రవీణ్ రాజీనామాకు ఎటువంటి సంబంధం లేదని ఆ విద్యార్థి సంఘం నాయకులు చెబుతున్నారు. అంతేకాదు,ఆయన ఏ పార్టీలో చేరట్లేదని... త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ స్వయంగా ప్రకటిస్తారని అంటున్నారు. అప్పటివరకూ ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని... ఊహాగానాలకు తావు లేదని అంటున్నారు.
Recommended Video

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనంగా మారుతారా..
ఐపీఎస్ అధికారిగా 26 ఏళ్ల ప్రవీణ్ కుమార్ ప్రయాణం విభిన్నంగా సాగిందనే చెప్పాలి. మొదట్లో ఐపీఎస్ అధికారిగా ఉత్తర తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలను నిలువరించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ఆయన బెల్లంపల్లి,కరీంనగర్ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు వేల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగానూ ఆయన పేరు తెచ్చుకున్నారు. పోలీస్ శాఖలో తనదైన గుర్తింపుతో సాగుతున్న వేళ అనూహ్యంగా ఆయన కొంత బ్రేక్ తీసుకున్నారు. హార్వర్డ్ విశ్వ విద్యాలయానికి వెళ్లి ఉన్నత విద్య అభ్యసించి తిరిగి స్వదేశానికి వచ్చారు. అప్పటినుంచి బడుగు,బలహీన వర్గాల కోసం పనిచేయాలన్న దృక్పథంతో.. వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో ఏరి కోరి విద్యా శాఖలోకి అడుగుపెట్టారు. సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా ఆ విద్యా సంస్థలను అత్యంత ఉన్నత స్థితికి చేర్చారు. తెలంగాణ గురుకులాల్లో సీట్లు ఇప్పుడు హాట్ కేకుల్లా మారిపోయాయి. విద్యా వ్యవస్థలో తనదైన ముద్ర వేసిన ఐపీఎస్ ప్రవీణ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ సంచలనంగా మారబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications