హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆరితేరిన మోసగాళ్లు: ఇరానీ గ్యాంగ్ అరెస్ట్, 85తులాల గోల్డ్ సీజ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నమ్మించి మోసగించడమే వారి పని. పోలీసులమంటూ జాగ్రత్తలు చెబుతారు. రోడ్డుపై రూ. 10 పడిందని తీసుకోమని సూచిస్తారు. నమ్మిన వారిని మోసగించి, వారి వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలను అపహరిస్తారు. ఈ విధమైన చోరీలకు పాల్పడుతున్న కర్ణాటకకు చెందిన ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులు ముగ్గురిని ఈస్ట్‌జోన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

వ్యాపారం ముసుగులో మోసాలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఈ నిందితుల నుంచి రూ. 25 లక్షల విలువైన 85 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను క్రైమ్స్, సిటీ అడిషనల్ పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా వెల్లడించారు. ఇరానీ ముఠా సభ్యులు నగరంలో దొంగతనాలు చేసి కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు పారిపోతున్నారని స్వాతి లక్రా తెలిపారు.

నగర పోలీసులు ఆ రాష్ట్రాలకు వెళ్లి దాడులు చేస్తున్నందున ఇరానీ గ్యాంగ్ సభ్యులు నగరానికి రావాలంటే భయపడుతున్నారని చెప్పారు. గతంలో ఈ ముఠాపై అనేక కేసులు ఉన్నందున పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. కర్ణాటక రాష్ట్రం గడక్ జిల్లాకు చెందిన కళ్లజోళ్ల వ్యాపారి అమ్జాద్ అక్బర్ అలీ బేగ్ అలియాస్ అమ్జాద్.. పేరు మోసిన ఇరానీ గ్యాంగ్ ముఠా నాయకుల్లో ఒకడు.

ఇతడు నలుగురు సభ్యులతో ముఠాను ఏర్పాటు చేసి తెలంగాణ, మహారాష్ట్రల్లో మోసాలు, చైన్ స్నాచింగ్‌లు చేశాడు. దీంతో రెండు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. ఇలాంటి నేరాలపై అమ్జాద్‌ను మహారాష్ట్ర భీవండి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఈ గ్యాంగ్ 13 సూడో పోలీసు, 2 దృష్టి మళ్లించి నగదు అపహరించడం, 5 చైన్ స్నాచింగ్‌లు ఉన్నాయి.

ముఠా నాయకుడైన అమ్జాద్ తోపాటు అతడి ముఠాలో సభ్యుడైన అదే రాష్ట్రానికి చెందిన పెట్టీ వ్యాపారి దాదు అస్గర్ అలీబేగ్ అలియాస్ దాదు, మరో సభ్యుడు ఫయాస్ అన్సారీ అలియాస్ పాప్‌లూను అరెస్ట్ చేసి 20 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో డిఐజి ప్రభాకరరావు, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపి ఎన్ కోటిరెడ్డి, ఇన్‌స్పెక్టర్ సిహెచ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇరానీ గ్యాంగ్ అరెస్ట్

ఇరానీ గ్యాంగ్ అరెస్ట్

నమ్మించి మోసగించడమే వారి పని. పోలీసులమంటూ జాగ్రత్తలు చెబుతారు. రోడ్డుపై రూ. 10 పడిందని తీసుకోమని సూచిస్తారు. నమ్మిన వారిని మోసగించి, వారి వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలను అపహరిస్తారు.

ఇరానీ గ్యాంగ్ అరెస్ట్

ఇరానీ గ్యాంగ్ అరెస్ట్

ఈ విధమైన చోరీలకు పాల్పడుతున్న కర్ణాటకకు చెందిన ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులు ముగ్గురిని ఈస్ట్‌జోన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

ఇరానీ గ్యాంగ్ అరెస్ట్

ఇరానీ గ్యాంగ్ అరెస్ట్

వ్యాపారం ముసుగులో మోసాలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఈ నిందితుల నుంచి రూ. 25 లక్షల విలువైన 85 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇరానీ గ్యాంగ్ అరెస్ట్

ఇరానీ గ్యాంగ్ అరెస్ట్

ఈ మేరకు వివరాలను క్రైమ్స్, సిటీ అడిషనల్ పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా వెల్లడించారు.

English summary
Irani thieves gang arrested in Hyderabad on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X