సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగాలకు కార్తీకమాసం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !!

Secunderabad- Sapta Jyotirlinga tourist special train: సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శనం పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మహాకాళేశ్వరం- ఓంకారేశ్వరం- త్రయంబకేశ్వరం వంటి సప్త జ్యోతిర్లింగ పుణ్య క్షేత్రాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. 10 రాత్రులు/ 11 పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది.

ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ నుండి ఈ భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 237, 3ఏసీ- 416, 2ఏసీ- 52. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ కు కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, హుజూర్ సాహిబ్ నాందెడ్, పూర్ణ జంక్షన్ స్టేషన్‌లల్లో హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.

IRCTC to run Sapta Jyotirlinga Darshan Yatra by Bharat Gaurav express from Secunderabad November 17

మొదట ఉజ్జయినీలో వెలిసిన మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం జ్యోతిర్లింగ ఆలయాల దర్శనంతో ఈ యాత్ర ప్రారంభమౌతుంది. ఈ రెండు క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయవచ్చు. అనంతరం గుజరాత్ లోని ద్వారకాకు బయలుదేరి వెళ్తుంది ఈ ఎక్స్ ప్రెస్. అక్కడ నాగేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకునే వెసలుబాటు ఉంది. ద్వారకాధీశుడి ఆలయం, బెట్ ద్వారకాలను దర్శిస్తారు. అక్కడి నుంచి సోమనాథ్ వెళ్తుంది. అక్కడ- జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథేశ్వరుడిని యాత్రీకులు సేవించుకోవచ్చు.

పవన్ కల్యాణ్ విడాకులపై మూడు రోజుల ముందే హింట్ ఇచ్చిన రేణు దేశాయ్
పవన్ కల్యాణ్ విడాకులపై మూడు రోజుల ముందే హింట్ ఇచ్చిన రేణు దేశాయ్

ఆ తర్వాత మహారాష్ట్రలోని పుణేకు చేరుకుంటుంది ఈ భారత్ గౌరవ్ ఎక్స్ ప్రెస్. అక్కడ భీమశంకరం, శ్రీ విఘ్నహర గణపతి ఆలయాల దర్శనం ఉంటుంది. ఆ తర్వాతి గమ్యస్థానం.. నాసిక్. నాసిక్ సమీపంలో పశ్చిమ కనుమల్లో వెలిసిన ప్రఖ్యాత త్రయంబకేశ్వరాన్ని భక్తులు దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు ఈ ఐఆర్సీటీసీ ఈ టూర్ ద్వారా. దీని తర్వాత నేరుగా ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) కు వెళ్తారు. అక్కడ ఘృష్ణేశ్వరుడిని దర్శిస్తారు. దీంతో ఈ యాత్ర పూర్తవుతుంది. అక్కడి నుంచి తిరిగి సికింద్రాబాద్ కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్.

పవన్ కల్యాణ్ విడాకులపై రెండేళ్ల కిందటే వేణు స్వామి జోస్యం
పవన్ కల్యాణ్ విడాకులపై రెండేళ్ల కిందటే వేణు స్వామి జోస్యం

ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 18,000 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 16,700 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు 27,400, పిల్లలకు 25,900 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలకు 35,500, పిల్లలకు 33,600 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో రైలు టికెట్లు, రోడ్డు రవాణా, హోటల్ వసతి, భోజనం, ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+