హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియా వైద్యుల ఘనత: కంట్లోకి దూసుకెళ్లిన ఐరన్ హుక్ తొలగింపు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రమాదవశాత్తూ కంట్లో ఇనుప చువ్వ గుచ్చుకుపోయిన 12 ఏళ్ల బాలుడికి ఉస్మానియా వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణం పోశారు. అంతేకాదు ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి మరో ఘనతను సాధించారు.

వివరాల్లోకి వెళితే పాతబస్తీ జహానుమా ప్రాంతానికి చెందిన మహ్మద్‌బాబా(12) ఈ నెల 6న మాంసం దుకాణంలో ఉండగా, మాంసాన్ని వేలాదీసే ఐరన్ హుక్ ప్రమాదవశాత్తూ కంటి పక్కనుంచి తలలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు.

బాలుడిని పరీక్షించిన ఉస్మానియా న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ ప్రేమ్‌జిత్‌రాయ్‌ ఐరన్‌హుక్‌ నేరుగా మెదడులోకి చొచ్చుకుపోయిందని గుర్తించి, రక్తస్రావాన్ని నివారించారు. ప్రేమ్‌జిత్‌రాయ్‌ నేతృత్వంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వేణుగోపాల్‌, అనస్థీషియా విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సద్గుణలతో కూడిన వైద్యబృందం బాలుడికి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు.

Iron rod removed from a youth brain at Hyderabad

సుమారు మూడు గంటల పాటు శ్రమించి బాలుడి కంటి నుంచి ఐరన్ హుక్‌ను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇన్ఫెక్షన్‌ ప్రమాదం ఉన్న క్రమంలో అతడిని వైద్యుల సంరక్షణలో ఉంచామని డాక్టర్‌ రాయ్‌ తెలిపారు.

ఏమాత్రం ఆలస్యమైనా బాలుడి మెదడు ఇతర శరీర భాగల్లోకి ఇన్‌ఫెక్షన్ సోకి బ్రెయన్ స్టోక్ వచ్చే ప్రమాదం ఉండేదని వైద్యులు తెలిపారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసిన వైద్య బృందాన్ని, సిబ్బందిని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జీవీఎస్‌ మూర్తి అభినందించారు.

English summary
Iron rod removed from a youth brain at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X