• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌కు ఆత్మగౌరవ పరీక్ష: కెసిఆర్ సవాల్‌కు రెడీ, కార్యాచరణ

By Swetha Basvababu
|

హైదరాబాద్: రైతులకు వ్యవసాయంలో ఆర్థిక సాయం చేసేందుకు ఏర్పాటుచేసిన రైతు సమన్వయ సమితులకు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి ఏర్పాటుపై ఇంకా ఏమీ తేలలేదు. దీనికి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని నియమించాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తలపోస్తున్నారని వార్తలు వచ్చాయి.

అదే జరిగితే లాభ దాయక పదవి కిందకు వస్తే గుత్తా సుఖేందర్ రెడ్డి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వస్తుంది. ఈ విషయమై నెలకొన్న అనిశ్చితి మరో వారం, పది రోజుల పాటు సాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాస్తవానికి గత ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం కూడా కాంగ్రెస్‌దే. పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే.

నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందో లేదోననే అనుమానం కాంగ్రెస్‌లో ఉన్నా, అన్ని విధాల సిద్ధంగా ఉండాలనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది. దీనికి అనుగుణంగానే జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయదశమి తర్వాత ఆ జిల్లాలో తమ అసెంబ్లీ స్థానాల్లో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించినట్లు సమాచారం. నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి.

దీటుగా జవాబివ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యూహం

దీటుగా జవాబివ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యూహం

నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక ద్వారా ఫిరాయింపులపై విపక్షాల విమర్శలకు సమాధానం చెప్పవచ్చనే ఆలోచనతోపాటు రానున్న ఎన్ని‌కలకు దీన్ని రిఫరెండంగా మార్చి కాంగ్రెస్‌ నోరు మూయించాలనే యోచన టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు కూడా విశ్లేషణలు వచ్చాయి. కాంగ్రెస్‌ దీనికి ధీటుగానే జవాబు చెప్పాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దసరా తర్వాత విస్తృత ప్రచారానికి కాంగ్రెస్ ఇలా

దసరా తర్వాత విస్తృత ప్రచారానికి కాంగ్రెస్ ఇలా

కాంగ్రెస్‌ గెలిచిన స్థానంలో మళ్లీ ఎన్నికలు తెచ్చి పోటీ పెట్టడాన్ని ‘ఆత్మగౌరవ' అంశంగా ప్రజల్లో ప్రచారం చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. ప్రజలు ఐదేళ్ల కోసం కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఫిరాయింపును ప్రోత్సహించి ఉప ఎన్నిక తేవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తూ ఉప ఎన్నికను నల్లగొండ ఆత్మగౌరవ పోరుగా మలచాలని కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే దసరా తర్వాత ఆయా నియోజక వర్గాల్లోని నేతలు ప్రజల వద్దకు వెళ్లాలని భావిస్తున్నారు.

రెండు స్థానాల్లో సీపీఐ, కాంగ్రెస్ సభ్యుల ఫిరాయింపులిలా

రెండు స్థానాల్లో సీపీఐ, కాంగ్రెస్ సభ్యుల ఫిరాయింపులిలా

నల్లగొండ పార్లమెంట్‌ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాగార్జునసాగర్‌లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కందూరు జానారెడ్డి, హుజూర్‌నగర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోదాడలో ఎన్ పద్మావతి, నల్లగొండ అసెంబ్లీ స్థానం పరిధిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. గత ఏడాది మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన భాస్కర్‌రావు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. మరో అసెంబ్లీ స్థానం దేవరకొండలో సీపీఐ తరఫున గెలుపొందిన రవీంద్ర కుమార్‌ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఫిరాయించారు. గత ఎన్నికల్లో కేవలం సూర్యాపేటలో గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి మాత్రమే టీఆర్‌ఎస్‌ తరఫున విజయం సాధించారు.

కాంగ్రెస్ పార్టీకి ఇలా సంప్రదాయ ఓటింగ్ బలం

కాంగ్రెస్ పార్టీకి ఇలా సంప్రదాయ ఓటింగ్ బలం

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి నియోజకవర్గంలో వారు పర్యటిస్తూ, కాంగ్రెస్‌ ఖాతాలో లేని స్థానాల్లో నేతలు వారి వారి పట్టు, ఉనికి ఆధారంగా ఉమ్మడిగా పర్యటించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటుతోపాటు టీడీపీ, ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు తమకు లాభిస్తాయని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ ఊపు ఉన్న సమయంలోనే కాంగ్రెస్‌ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నది. కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా నల్లగొండ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. కనుకే ఇపుడు గెలుపు నల్లేరు మీద బండి నడకే అని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.

టీఆర్ఎస్ పక్షానే స్థానిక ప్రజా ప్రతినిధులు

టీఆర్ఎస్ పక్షానే స్థానిక ప్రజా ప్రతినిధులు

దీనికి తోడు వివిధ సంక్షేమ పథకాల అమలుతో విజయం సాధించగలమని అధికార టీఆర్ఎస్ కూడా భావిస్తున్నది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా తర్వాత మారిన పరిస్థితుల్లో జడ్పీ చైర్మన్ బాలు నాయక్ సహా అంతా టీఆర్ఎస్ పక్షాన చేరిపోవడంతో విజయంపై అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఆశగా ఉన్నది. ఇక టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాజకీయాలకు అతీతంగా అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ ప్రతిష్ఠాత్మకం ఇలా

కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ ప్రతిష్ఠాత్మకం ఇలా

ఒకవేళ ఉప ఎన్నిక రాకపోయినా ఎలాంటి నష్టం లేదనీ, సాధారణ ఎన్నికల్లో ఇది పనికి వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతేకాక నల్లగొండ నేతలే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నిక వస్తే అందరికి ప్రతిష్ఠాత్మకంగా మారనున్నది. దాంతో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకోవాల్సిన అనివార్య పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకులు ఉన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There are speculation in the Telangana political circle that CM KCR ready to face Nalgonda Loksabha bye election with resignation of present MP Gutha Sukhender Reddy. Because CM KCR has proposed to appoint Gutha Sukhender Reddy as Rythu samanva Samiti state Chairman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more