వాస్తవాలు అడిగితే లీగల్ నోటీసులా.?ఇదెక్కడి పద్దతి.!ఐఏఎస్ అరవింద్ కుమార్ పై రేవంత్ ఫైర్.!

హైదరాబాద్ : ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మే 25న తనకు ఇచ్చిన లీగల్‌ నోటీసులను వెనక్కి తీసుకోకుంటే ఆయనపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసుకు రేవంత్‌ తన అడ్వకేట్ ద్వారా మంగళవారం సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు రేవంత్ రెడ్డి.

 Revanth

ఉపసంహరించుకోకపోతే చర్యలు తప్పవన్న రేవంత్..: నెహ్రూ ఓఆర్ఆర్ సగ భాగం తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మాల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని, అధిక ఆదాయం వచ్చే ఆస్కారం ఉన్నా ఆ దిశగా అలోచన చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి కేవలం రూ.7380 కోట్లకే ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు ఓఆర్ఆర్ టోల్ వసూలు టెండర్ కట్టబెట్టారన్నారు రేవంత్. అంతేకాకుండా ఐఆర్బీ టెండర్ కట్టబెట్టే క్రమంలో అన్ని నిబంధనలు యాదేచ్ఛగా ఉల్లంఘించారని, హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031తో ముగుస్తుందన్నారు. 30 ఏళ్లకు లీజుకు ఇస్తే..2031 తర్వాత మాస్టర్ ప్లాన్ మారుతుంది కాబట్టి దాంతో సమస్యలు వస్తాయన్నారు రేవంత్ రెడ్డి.

 Revanth

ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్చరించిన రేవంత్ రెడ్డి..: అంతేకాకుండా దేశంలో ఏ రహదారి టెడంర్ అయిన 15 - 20 ఏళ్లకు మించి ఇవ్వలేదని, 30 ఏళ్ల సుదీర్ఘ కాలానికి కాకుండా 15-20 ఏళ్ల వరకే టెండర్ వ్యవధి ఉండాలని నేషనల్ హైవేస్ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) సూచించిందని రేవంత్ గుర్తు చేసారు. అయినప్పటికీ ఎన్ హెచ్ఏఐ అభ్యంతరాలను కూడా లెక్క చేయకుండా 30 ఏళ్లకు టెండర్ కట్టబెట్టారని, నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ అధికారి స్థానంలో ఒక రిటైర్డ్ ఆఫీసరును నియమించి ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియను పూర్తి చేశారని రేవంత్ ఆరోపిస్తున్నారు. టెండర్ ప్రక్రియ కొనసాగుతుండగానే హెచ్ జీసీఎల్ (హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్) స్థానంలో హెచ్ఎండీఎను తీసుకొచ్చారని, అంతేకాదు ఓఆర్ఆర్ టెండర్ కు సంబంధించిన బేస్ ప్రైస్ ఎంతో వెల్లడించాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసిన అరవింద్ కుమార్ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు రేవంత్ రెడ్డి.

 Revanth

రాజకీయ నాయకుడి మాదిరిగా అరవింద్ వ్యవహరం..: ఓఆర్ఆర్ పై ట్రాఫిక్, టెండర్ విలువను మదింపు చేసిన మజర్స్ నివేదికను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదని, ఇవన్నీ టెండర్ల ప్రక్రియలో ఏదో జరిగిందనే అనుమానాలకు బలం చేకూరుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా సంబంధిత వ్యవహరంపై స్పందించాల్సిన భాద్యత తనపై ఉందని, ఈ క్రమంలో కావాల్సిన సమాచారాన్ని..ఆర్టీఐ ద్వారా తెలుసుకోవడానికి వెళ్తుంటే ఒక ప్రజాప్రతినిధిని అని కూడా చూడకుండా సచివాలయానికి వెళ్లకుండా అడ్డగించి అరెస్ట్ చేయించారని రేవంత్ గుర్తు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+