జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతామని ముందే చెబుతున్న కేటీఆర్?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు చేర్పించారంటూ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపణలు చేయడం అసంబద్ధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకరకంగా ఆయన ముందుగానే తమ పార్టీ ఓటమికి కారణాలు చెప్పేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి దొరికారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అధికారం ఎటువైపు ఉంటే అటువైపు ఉండే మజ్లిస్ పార్టీ కూడా మద్దతిస్తోంది. ఆ పార్టీకి ఈ నియోజకవర్గంలో 80వేల ఓటింగ్ ఉంది. ఇవన్నీరేవంత్ కు కలిసివస్తున్నాయి.
నియోజకవర్గంలో 20వేల దొంగ ఓట్లు చేర్చారంటూ నేరుగా ఎన్నికల సంఘం సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ దీన్ని గురించి ఏం మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు. అయితే అవి దొంగ ఓట్లు అని కేటీఆర్ కు ఎలా తెలుసు అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 2023 ఎన్నికల్లో ఆ పార్టీ చేర్పించిన దొంగ ఓట్లే అయివుంటాయనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రకరకాల ఆరోపణలు చేయడం, దొంగ ఓట్లు అనడం, అధికారులంతా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారడంలాంటివన్నీ కూడా కేటీఆర్ ముందుగానే తమ పార్టీ ఓటమిని ఒప్పుకున్నట్లవుతోందంటున్నారు.

భారత రాష్ట్ర సమితికి ఓటేస్తే ఏం చేస్తామనేది చెప్పడంలేదుకానీ, కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఏం జరుగుతుందో చెబుతున్నారు. హైడ్రా వచ్చి మీ ఇళ్లు కూల్చేస్తుందని ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భయంతో ప్రజలకు తమకు ఓటేస్తారనే ఆశతో బీఆర్ఎస్ నాయకులున్నారు. అయితే కేటీఆర్ కానీ, హరీష్ రావుకానీ జూబ్లీహిల్స్ లో రక్షణాత్మక ధోరణిని కనపరుస్తున్నారు. తాము గెలవగలం అనే ఆత్మవిశ్వాసాన్ని పార్టీ శ్రేణుల్లో కల్పించలేకపోతున్నారు. కేసీఆర్ అజ్ఞాత వాసంలో ఉన్నారని, పార్టీ వనవాసంలో ఉందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న దాడుల నుంచి ఆ పార్టీ రక్షించుకోలేకపోతోంది.












Click it and Unblock the Notifications