• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేవంత్ రెడ్డి మౌనం తుపాను ముందు నిశ్శ‌బ్ద‌మా..??

|
  రాహుల్ కోసం రేవంత్ రెడ్డి పడిగాపులు

  తెలంగాణ కాంగ్రేస్ పార్టీలో రేవంత్ రెడ్డి చ‌ర్చ‌నీయాంశంగా మారారు. కొద్ది నెల‌లుగా మౌనంగా ఉంటున్న రేవంత్ రెడ్డి నేరుగా పార్టీ జాతీయ అద్య‌క్షుడు రాహుల్ గాంధీ అప్పాయింట్ మెంట్ కోరుతున్నారు. రాహుల్ అప్పాయింట్ మెంట్ ఫిక్స్ అయితే స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్క‌రించ‌బ‌డ‌తాయ‌ని రేవంత్ వ‌ర్గం అంటోంది. స్థానిక పీసిసి తో త‌లెత్తిన విభేదాలు కూడా స‌ర్ధుమ‌నుగుతాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. రేవంత్ రెడ్డి మ‌ళ్లీ ప్ర‌జా క్షేత్రంలోకి అడుగుపెడితే తెలంగాణ‌ కాంగ్రేస్ పార్టీకి వంద సునామీల బ‌లం చేకూర‌డం ఖాయ‌మ‌ని కార్య‌క‌ర్త‌లు చ‌ర్చించుకున్న‌ట్టు తెలుస్తోంది.

  ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మౌనం వెన‌క వ్యూహం ఏంటి..?

  ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మౌనం వెన‌క వ్యూహం ఏంటి..?

  కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కనిపించడం లేదు.. పార్టీ కార్యక్రమాల్లో ఆయన జాడే లేదు. మీడియాలో రేవంత్ మాటే వినిపించడం లేదు. బస్సు యాత్రలో ఆయన ఊసే లేదు. అవును ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గొంతు మూగబోయింది. గత కొన్ని రోజులుగా ఆయన ఎక్కడనున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. పార్టీ కార్యక్రమాల్లో రేవంత్ ఎక్కడా కనిపించడం లేదు. గాంధీ భవన్ లో అడుగు పెట్టడం లేదు. సిఎల్పీలో కూర్చోవడం లేదు. పీసీసీ ఛీప్ వైఖరీతో అసంత్రుప్తిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం మౌన ముద్ర దాల్చారు. పార్టీలో చేరి నెలలు గడుస్తున్నా తనను పట్టించుకోకపోవడంపైన ఆయన గుర్రుగా ఉన్నారు. తనతో పాటు కాంగ్రెస్ లో చేరిన నాయకులకు న్యాయం చేయలేకపోతున్నానన్న ఆవేదన రేవంత్ లో కనిపిస్తోంది. కనీసం వారికైనా పదవులు ఇప్పించాలన్న పట్టుదలతో ఉన్న రేవంత్.. అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహర‌చ‌న చేస్తున్నారు.

  రాహుల్ గాంధీ అప్పాయింట్ మెంట్ ఇస్తే స‌మ‌స్య సాల్వ్ అయిన‌ట్టే..

  రాహుల్ గాంధీ అప్పాయింట్ మెంట్ ఇస్తే స‌మ‌స్య సాల్వ్ అయిన‌ట్టే..

  పీసీసీ స్థాయిలో నాయకత్వం ఉదాసీనంగా వ్యవహారిస్తుండటంతో నేరుగా హైకమాండ్ తోనే తేల్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం తర్వాత అపాయింట్ మెంట్ దొరుకుతుందని భావించినప్పటికి రాహుల్ అందుబాటులోకి రాలేదు. తాజాగా కర్ణాటకలో హంగ్ ఏర్పడటంతో రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇప్పట్లో దొరికే సూచనలు లేవు. పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా రాహుల్ అపాయింట్ మెంట్ దొరకలేదు. టీడీపీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి, టీఆర్ఎస్ నేత మదన్ మోహన్ రావు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరాల్సి ఉన్నా అనివార్య కార‌ణాల వ‌ల్ల వేరేలా జ‌రిగిపోయిందని రేవంత్ వర్గం చెప్తోంది. రాహుల్ గాంధీని కలిసిన తర్వాతనే రేవంత్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కానున్నారు. తాను పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం హైకమాండ్ వ్యవహారించాలని ఆయన కోరుతున్నారు.

  స్వ‌తంత్ర నిర్ణ‌యాలు అమ‌లు చేసుకునే ప‌ద‌వి కోరుతున్న రేవంత్ రెడ్డి..

  స్వ‌తంత్ర నిర్ణ‌యాలు అమ‌లు చేసుకునే ప‌ద‌వి కోరుతున్న రేవంత్ రెడ్డి..

  టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ శాసనసభా పక్ష నేత పదవి వదులుకొని రేవంత్ రెడ్డి కాంగ్రె్ లో చేరారు. తన స్థాయికి తగిన పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే తీసుకోనని తాజాగా రేవంత్ అన్నారు. ఆ పదవి తీసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీటు పక్కన మరో కుర్చీ వేస్తారే తప్ప ప్రయోజనం ఉండదన్నది ఆయన ఆలోచన . పీసీసీ ఛీప్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడం మినహా మరో మార్గం ఉండదు. కాని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లే పదవి కోసం రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. అప్పుడే తన ఆలోచలను సమర్థవంతంగా అమలు చేయవచ్చునని ఆయన భావిస్తున్నారు. కనీసం తన సలహాలు తీసుకోవడానికి పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టపడని నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చారు.అందుకే ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తే తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారు.

  రాహుల్ తో స‌ఖ్య‌త రేవంత్ కి క‌లిసొచ్చే అంశం..

  రాహుల్ తో స‌ఖ్య‌త రేవంత్ కి క‌లిసొచ్చే అంశం..

  పార్టీని పరుగులు పెట్టించే వ్యూహాలను అమలు చేయడానికి అదే సరైన పదవన్నది ఆయన అంచనా. అందుకే తనతో పాటు తన అనుచరుల పదవులపైన అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. హైకమాండ్ ఆలోచనలు తెలుసుకున్న తర్వాతే ఆయన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కానున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బస్సు యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొనడం లేదు. దీంతో సభలు ఉప్పు లేని పప్పుగా కనిపిస్తున్నాయి. తమ నియోజకవర్గాల్లో జరిగే సభలకు రావాలని రేవంత్ రెడ్డిని స్థానిక నాయకులు కోరుతున్నారు. కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పార్టీ సీనియర్లు మాత్రం ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. రేవంత్ రెడ్డి రాకపోవడం తమకే మంచిదన్న ఆలోచనలో కొందరున్నారు. మొత్తానికి రేవంత్ అంశం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఎపిసోడ్ కు రాహుల్ ఎలా శుభం కార్డు వేస్తారో వేచి చూడాల్సిందే.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The charming leader in congress party revanth reddy maintaining distance with the t pcc. revanth alleged the seniors are trying to keep him in the dark side. that's why he is asking appointment for aicc chief rahul gandhi. revanth followers are saying that if appointment finalize with rahul gandhi the issue will be settle down.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more