షాకింగ్: చిన్నపిల్లలే సూసైడ్ బాంబర్లుగా మోడీని టార్గెట్ చేసిన ఐసిస్!
న్యూఢిల్లీ/హైదరాబాద్: రిపబ్లిక్ దినోత్సవం నాడు ఐసిస్ సహా పలు ఉగ్రవాద సంస్థలు ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశాయని ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన నివేదిక కలకలం రేపుతోంది. 12-15 ఏళ్ల మధ్య పిల్లలను సూసైడ్ బాంబర్లుగా ఉపయోగించి ప్రధాని మోడీని టార్గెట్ చేశారని తెలుస్తోంది.
ప్రధాని మోడీ హత్యకు బాలలను పావులుగా వాడుకోవాలని ఐసిస్ ప్రణాళిక రచిస్తున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. రిపబ్లిక్ డే నాడు టీనేజ్ బాలలను ఆత్మహుతి దళంగా ఉపయోగించాలని ప్లాన్ చేసిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

12 - 15 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఆయుధాలు, పేలుడు పదార్థాలను వినియోగించడంలో శిక్షణ ఇచ్చిందని పేర్కొంది. ఈ హెచ్చరికను శుక్రవారం ఢిల్లీలోని ఎస్పీజీ, పోలీసులకు అందజేశారు. దీంతో భద్రత వలయాన్ని దాటి వెళ్లవద్ద ఎన్‌ఎస్‌ఏ అధిపతి అజిత్ ధోవల్ ప్రధానికి సూచించారు.
ఆగస్టు 15న ఆయన ఈ విధంగా వెళ్లి చిన్నారులతో మమేకమయ్యారు. ఇప్పటికే గణతంత్ర దినోత్సవాలకు హైఅలర్ట్ ప్రకటించడంతో భారత నిఘా సంస్థలు, ఫ్రెంచి నిఘా సంస్థలు కలిసి పని చేస్తున్నాయి.

మరోవైపు పట్టుబడిన ఐసిస్ ఉగ్రవాది నజీబ్ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాదులో పదిమందిని తమ వైపుకు తిప్పుకున్నట్లు నజీబ్ ఎన్ఐఏ విచారణలో చెప్పాడు. దక్షిణాదిన బాగా నెట్ వర్క్ ఉన్నట్లు చెప్పాడు.












Click it and Unblock the Notifications