Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గులాబీ విద్యార్ధి విభాగం హుందాతనం ఇదేనా.?రాహుల్ ఉస్మానియా విజిట్ పై ఎందుకు ఉలికిపాటు.?

హైదరాబాద్ : తెలంగాణ కల సాకారమై ఎనిమిదేళ్లు పూర్తికావస్తుంది. ప్రాంతీయ భేదాలు, విభజన, రెండు వేర్వేరు రాష్ట్రాలు, ఎవరి పాలన వారిది అన్న అంశానికి ప్రజలు అంత ప్రాముఖ్యతనివ్వకుండా ఎవరి పనులు వారు చేసుకుంటూ తెలంగాణ ప్రజలు ఆంధ్రాలో, ఆంధ్ర ప్రజలు తెలంగాణలో జీవనం సాగిస్తున్నారు. అసలు ఇరురాష్ట్రాల సాధారణ ప్రజల్లో ఎలాంటి భాషా భేదం గానీ, ప్రాంతీయ అసమానతలు గాని లేవని చెప్పొచ్చు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా రాజకీయంగా వాతావరణం ఘర్షణ పూరితంగా మారింది తప్పితే ప్రజల్లో ఎలాంటి భేదాభిప్రాయలు తలెత్తలేదు.

 ఓయూలో రాహుల్ మేథోమధన సదస్సు.. ఉలిక్కిపడుతున్న గులాబీ పార్టీ..

ఓయూలో రాహుల్ మేథోమధన సదస్సు.. ఉలిక్కిపడుతున్న గులాబీ పార్టీ..

పరస్పరం ఎదురుపడి నువ్వు తెలంగాణ వాడివి, నువ్వు ఆంధ్ర వాడివి అని దూషించుకున్న సందర్బాలు కూడా ఎక్కడా ఎదురుపడలేదు. రాజకీయ కోణంలో మాత్రం కొన్ని ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఇదంతా గతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తి కావస్తోంది. ఎవరి రాష్ట్రం వారిదైపోయింది.. ఎవరి పాలన వారిదైపోయింది. ఇంత వరకూ ఎలాంటి సమస్యలేకపోయినప్పటికీ తెలంగాణ కల సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ పట్ల హుందాగా వ్యవహరించాల్సిన గులాబీ పార్టీ ఇప్పటికీ విషం చిమ్మే రీతిలో వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.

 రాహుల్ సభకు అనుమతి ఇవ్వొద్దు.. వీసీకి గులాబీ విద్యార్ధి విభాగం విజ్ఞప్తి..

రాహుల్ సభకు అనుమతి ఇవ్వొద్దు.. వీసీకి గులాబీ విద్యార్ధి విభాగం విజ్ఞప్తి..


ప్రత్యేక తెలంగాణ అంశంలో కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తే గులాబీ పార్టీ ఉలిక్కి పడాల్సిన అవసరం ఏముందో అర్థం కాని అంశం. రాహులు గాంధీ తెలంగాణలో ఎక్కడ పర్యటించినా స్వాగతం పలకాల్సిందిపోయి అక్కడ సమావేశాలు ఎందుకు? ఇక్కడ ఎలా పర్యటిస్తారు.?ఉస్మానియా యూనివర్సీటీలో రాహుల్ సమావేశానికి అనుమతి ఇవ్వరాదని వినతి పత్రాలు ఇవ్వడం గులాబీ శ్రేణులకు ఎంతవరకు సమంజసమనే చర్చ జరుగుతోంది

 హుందాతనం లోపించిన విద్యార్ధి విభాగం.. లోపించిన రాజకీయ స్పూర్తి..

హుందాతనం లోపించిన విద్యార్ధి విభాగం.. లోపించిన రాజకీయ స్పూర్తి..

రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులతో సమావేశం నిర్వహిస్తే టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పుడు భూస్థాపితం కాదు కదా.? గులాబీ నాయకులందరూ ఓయూ కు క్యూ కట్టి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోరు కదా.?ఓయూలో రాహుల్ మేథోమధన సమావేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్ప కూలిపోదు కదా.? రాహుల్ పర్యటన ప్రజల మీద ప్రభావం చూపిస్తుందనడానికి ఇది ఎన్నికల సమయం కూడా కాదు కదా.? మరి అలాంటప్పుడు చదువుకున్న గులాబీ విద్యార్ధి విభాగం నాయకులు గానీ, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గానీ రాహుల్ గాంధీ సమావేశం పట్ల ఎందుకు అభద్రతా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీ పర్యటన.. టీఆర్ఎస్వీకి ఏంటి అభ్యంతరం అంటున్న కాంగ్రెస్

రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీ పర్యటన.. టీఆర్ఎస్వీకి ఏంటి అభ్యంతరం అంటున్న కాంగ్రెస్

ఇది తెలంగాణ రాజకీయాల ఔన్నత్యాన్ని పెంచుతుందా.?దిగజార్చుతుందా.?రాహుల్ గాంధీ సభను అడ్డుకుని తెలంగాణ విద్యార్ధి విభాగం గానీ, గులాబీ పార్టీ గానీ సాధించేది ఏంటి.? ప్రజల్లో మరింత చర్చకు ఆస్కారం కలిగించడం తప్ప టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీ పర్యటన ఉస్మానియాలో ఉంటుందని కాంగ్రెస్ ముఖ్యనేతలు స్పష్టం చేస్తున్నప్పుడు గులాబీ నాయకులకు కలిగే నష్టం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

 కేటీఆర్ చొరవ తీసుకోవాలి.. యువతకు దిశానిర్దేశం చేయాలంటున్న నేతలు

కేటీఆర్ చొరవ తీసుకోవాలి.. యువతకు దిశానిర్దేశం చేయాలంటున్న నేతలు

ఓయూలో రాహుల్ గాంధీ మేధోమధన సదస్సును అడ్డుకుని తమ అభద్రతాభావాన్ని తెలంగాణ సమాజానికి చాటుకున్నట్టయిందనే చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణ సిద్దించి ఎనిమిదేళ్లవుతున్నా ఇంకా ఏదో తెలియని అభద్రాతాభావంలో టీఆర్ఎస్ పార్టీ, దాని అనుబంధ విభాగాలు కొట్టుమిట్టాడుతున్న సంకేతాలనిస్తున్నాయి. రాజకయాల్లో స్పూర్తిని చాటుకున్నప్పుడే పరిణతి చెందిన పార్టీగా గులాబీ పార్టీని ప్రజలు గుర్తిస్తారన్న అంశం టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలి, ముఖ్యంగా ఓయూ విద్యార్ధులు కూడా ఈ అంశాన్ని గ్రహించాలనే చర్చ జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+