హైవేలే అడ్డా.. 15 ఘోరమైన నేరాల్లో.. సీరియల్ కిల్లర్లుగా దిశ హంతకులు.. వెలుగులోకి దారుణాలు!

దిశ కేసులో నిందితులకు సంబంధించిన నేరాలు దిగ్భ్రాంతికి గురిచేసేలా ఉన్నాయి. దిశ హత్య తర్వాత వారి చేసిన అకృత్యాలు అటు పోలీసులనే కాకుండా సాధారణ ప్రజలకు కూడా షాక్ కలిగించేలా ఉన్నాయి. దిశ నిందితుల గురించి తాజాగా చేస్తున్న దర్యాప్తులో అనేక విషయాలు వెల్లడవుతున్నాయని తెలంగాణ పోలీసులు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం చేసి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిందితులకు సంబంధించిన కేసులో వెలుగు చూస్తున్న వివరాలు ఇవే..

Recommended Video

    Disha Case : పోలీసులు సైతం నివ్వెరపోయేలా: తొమ్మిది హత్యలు! || Oneindia Telugu

     దిశ ఎన్‌కౌంటర్ తర్వాత

    దిశ ఎన్‌కౌంటర్ తర్వాత

    దిశ సజీవ దహనం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిందితులు మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ డిసెంబర్ 6వ తేదీన తెలంగాణ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌కు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు భారీగా లభించడం గమనార్హం. ఈ ఘటన దేశవ్యాప్తంగా నేరవ్యవస్థలో శిక్షల అమలుపై చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

    పలు దారుణాలు చేసినట్టు

    పలు దారుణాలు చేసినట్టు

    దిశ రేప్ ఘటనలో నలుగురిని విచారించినప్పుడు వారు చేసిన కొన్ని అత్యాచారాలు, మానబంగాలు, సజీవ దహనం కేసు గురించి బయటపెట్టారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్‌లో అనేక నేరాలకు పాల్పడినట్టు ఆరిఫ్, చెన్నకేశవులు వెల్లడించారని తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో మొత్తం ఆరు నేరాలకు పాల్పడినట్టు దర్యాప్తులో అంగీకరించారని తెలిపారు.

     హైవేలే అడ్డాగా

    హైవేలే అడ్డాగా

    కర్ణాటక నుంచి ఇటుకలు తీసుకవచ్చే పని కోసం లారీ నడపుతుంటారు. ఆ క్రమంలో కర్ణాటకలోని గంగావతి నుంచి ఇటుకలు తీసుకొవచ్చే నేపథ్యంలో శంషాబాద్‌కు సమీపంలోని టోల్ ప్లాజా వద్ద దిశపై పక్కా ప్లాన్ ప్రకారం అత్యాచారం జరిపి సజీవ దహనం చేశారు అని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా హైవేలను అడ్డాగా చేసుకొని ఈ దారుణాలకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం.

    ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేరాలు

    ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేరాలు

    ఆరిఫ్, చెన్నకేశవులకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ గ్రూప్ గురించి దర్యాప్తు మరింత విస్తృతం చేశారు. దాదాపు 15 కేసుల్లో వీరికి ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. హైవే సమీపంలో జరిగిన సజీవ దహనం కేసులపై మళ్లీ దర్యాప్తు చేస్తున్నాం. కర్ణాటకలోని రాయ్‌చూర్, కలబుర్గి, కొప్పాల్ జిల్లాలకు పోలీసు బృందాలను పంపి విచారణ చేప్పట్టాం. దిశ నిందితుల మొబైల్‌ నంబర్లను ట్రాక్ చేస్తూ కొన్ని ప్రాంతాల్లో వారి నేరాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం అని తెలంగాణ పోలీస్ శాఖ తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+