వీడుతున్న విక్రమ్ కాల్పుల మిస్టరీ: డ్రగ్స్ కేసుతో లింక్, అప్పులే కారణమా?
మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు మరో కొత్త మలుపు తిరిగింది.
హైదరాబాద్: మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు మరో కొత్త మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసుతో సంబంధాలు, భారీ మొత్తం(సుమారు రూ.20కోట్ల మేర)లో చేసిన అప్పుల కారణంగానే విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పోలీసులు కూడా విక్రమ్ గౌడ్‌ది ఆత్మహత్యాయత్నంాయత్నం అనే భావనకు వచ్చారు. ఎందుకంటే ఆ సమయంలో విక్రమ్ ఇంట్లోకి ఎవరూ వచ్చినట్లుగా ఆనవాళ్లు లభించకపోవడం గమనార్హం.

విక్రమ్ ఫోన్లో డేటాలో డ్రగ్స్ కేసు రిపోర్టులు
కాగా, విక్రమ్ గౌడ్ తన ఫోన్లోని డేటాను భార్యకు పంపినట్లు తెలుస్తోంది. ఆ డేటాలో గత పదిరోజుల నుంచి డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన వార్తలు ఉన్నట్లు సమాచారం. అయితే, డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేకుంటే ఆ డ్రగ్స్ రిపోర్టుకు సంబంధించిన సమచారం ఎందుకు సేకరించారనే అనుమానాలు కలుగుతున్నాయి.
Recommended Video


భయంతోనే ఆత్మహత్యాయత్నంాయత్నమా?
అంతేగాక, విక్రమ్ గౌడ్‌కు మాదాపూర్‌లోని ఓ పబ్‌లో సహ యజమానిగా ఉన్నట్లు తెలిసింది. ఆ పబ్బులో ఏమైనా డ్రగ్స్‌కు సంబంధించిన కార్యకలాపాలు ఏమైనా జరిగాయా? అనేది ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. డ్రగ్స్ కేసులో తన పేరు కూడా బయపటపడుతుందనే భయంతోనే విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్‌ను సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ పరామర్శించారు.

అప్పులు కూడా కారణమేనా?
ఇది ఇలా ఉండగా, విక్రమ్ కు భారీగా అప్పులున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే చాలా మంది అతని వాట్సప్‌కు తమ అప్పులు ఎప్పుడు తీరుస్తావంటూ సందేశాలు పంపారు. ఒకరు రూ. 15లక్షలు అని, మరొకరు 20లక్షలని, ఇంకొకరు 35లక్షలు చెల్లించాలంటూ విక్రమ్ వాట్సప్‌లో సందేహాలుండటం గమనార్హం. ఇలా 39సందేశాలున్నట్లు తెలిసింది. కాగా, తండ్రి ఇచ్చిన ఇంటిని కూడా విక్రమ్ అమ్మేసినట్లు సమాచారం.

అసలేం జరిగింది?
శుక్రవారం తెల్లవారుజామున 3.30గంటలకు గుడికి వెళదామని ఇంట్లోని హాలులో కూర్చున్న సమయంలో ఎవరో ఆగంతకులు వచ్చి కాల్పులు జరిపారని.. ఆ శబ్ధం విని వచ్చి చూసే సరికి తన భర్త రక్తపు మడుగులో ఉన్నారని విక్రమ్ భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. అయితే, ఘటనా స్థలంలో ఒక బుల్లెట్ పోలీసులకు లభ్యమైంది.. కానీ, రివాల్వర్ మాత్రం దొరకలేదు. ఆత్మహత్యాయత్నంాయత్నం చేసుకుంటే.. ఆ రివాల్వర్ ఎవరు మాయం చేశారనేది కూడా సందేహంగా మారింది. ఆ సమయంలో ఇంట్లోకి ఎవరూ కూడా వచ్చిన దాఖలాలు కూడా లేకపోవడం గమనార్హం.

నోరు విప్పకపోతే అంతే..
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్ మాత్రం ఈ కాల్పుల ఘటనపై నోరుమెదపడం లేదు. ఎవరు కాల్పులు జరిపారో తెలుసుకానీ, చెప్పలేనని చెబుతుండటం గమనార్హం. తాను కోలుకున్న తర్వాత చెబుతానని మరోసారి చెప్పడం గమనార్హం. తండ్రి ముకేష్ గౌడ్ అడిగినా, హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి అడిగినా కూడా కాల్పుల ఘటనకు సంబంధించిన సమాచారం విక్రమ్ గౌడ్ బయటపెట్టకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు విక్రమ్ గౌడ్ ఇంట్లో సోదాలు ప్రారంభించారు. రివాల్వర్ కోసం కూడా తనిఖీలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications