షాకిచ్చే కొత్త కోణం: మావోలతో ఐసిస్ ఉగ్రవాదులకు లింక్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాదులో విధ్వంసానికి కుట్ర పన్నిన ఐసిస్ సానుభూతిపరుల విషయంలో కొత్త కోణం వెలుగు చూసింది. మావోయిస్టులతో వారికి సంబందాలున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) గుర్తించింది. ఐసిస్ ఉగ్రవాదులు, స్థానికంగా నక్సలైట్లతో కలిసి విధ్వంసాలు సృష్టించేందుకు, అవసరమైన ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వ్యూహరచన చేసినట్లు ఎన్ఐఎ వెల్లడించింది.

భారత దేశంలోని సానుభూతిపరులను ఏకం చేసి, పేలుడు పదార్ధాలతో భారీ విధ్వంసాన్ని సృష్టించాలని పథక రచన చేస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 18 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ గత జనవరిలో అరెస్టు చేశారు. ఈ నిందితుల కుట్రలకు సంబంధించిన చార్జిషీట్‌ను మంగళవారం ఎన్‌ఐఏ ఢిల్లీలోని పాటియాలా కోర్టులో సమర్పించింది.

హైదరాబాద్ విధ్వంసానికి ఐసిస్ కుట్ర: అజ్మీర్‌లో ఉగ్రవాదుల మకాం

చార్జిషీట్‌లోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి... మహ్మద్ నఫీస్ ఖాన్, ముదబ్బిర్ ముస్తాఖ్ షేక్, అబూ అనస్, నజ్మల్ హుడా, మహమ్మద్ అఫ్జల్, మహ్మద్ షరీఫ్ మోహినుద్దీన్ ఖాన్, షోహెల్ అహ్మద్, ఆసిఫ్‌అలీ, మహ్మద్ ఒబేదుల్లా ఖాన్, మహ్మద్ అలీమ్, మహ్మద్ హుస్సేన్ ఖాన్, సయ్యద్ ముజాహిద్, ఇమ్రాన్ ఖాన్, మహ్మద్ అజార్‌ఖాన్, ముఫ్తి అబ్దుస్‌సమి ఖాసిమ్‌లపై ఎన్ఐఎ అధికారులు ఛార్జీషీట్ దాఖలు చేశారు.

గత నెలలో ప్రధాన నిందితుడైన మహ్మద్ నజీర్‌పై చార్జిషీట్ దాఖలు చేసి, తాజాగా మిగతా నిందితులపై సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఇందులో నఫీజ్‌ఖాన్, అబూ అనస్, మహ్మద్ షరీఫ్ మొహినుద్దీన్ ఖాన్, మహ్మద్ ఒబేదుల్లాఖాన్‌లు హైదరాబాద్‌లో అరెస్టయ్యారు.

ISIS men chargesheeted; accused were in touch with Maoists

దేశంలో ఐఎస్ సానుభూతి పరులందరిని కలిపి, వారితో భారీ విధ్వంసాలు చేయించాలనే లక్ష్యంతో ఐఎస్ మీడియా చీఫ్ యూసుఫ్-అల్-హింది అలియాస్ షఫీ ఆర్మర్ ఐఎస్‌కు అనుబంధంగా దేశంలో జూనుద్- ఉల్- ఖలీఫా- ఫిల్- హింద్ అనే సంస్థను ప్రారంభించాడు. జిహాదీ సాహిత్యం, ఐఎస్ గూర్చి యువకులకు బోధిస్తూ, సోషల్ మీడియాలో సానుభూతి పరులైన యువకులతో అర్మార్ మాట్లాడేవాడు.

ఇందుకు ఫేస్‌బుక్, వాట్సాప్, ట్రిలియన్, స్కైప్, షూర్‌స్పాట్, ట్విట్టర్, చాట్ సెక్యూర్, నింబుజ్, టెలిగ్రామ్‌ను వాడుకునేవాడు. వీరంతా బెంగుళూరు, హైదరాబాద్, తుమ్కూర్, ముంబై, ఔరంగాబాద్‌లలో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌లో రెండుసార్లు వారు సమావేశమైనట్టు ఎన్‌ఐఏ తెలిపింది. పేలుడు పదార్థాల తయారీకి వారు సమకూర్చుకొన్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. విధ్వంసాల కోసం హవాలా మార్గంలో రూ.2.5లక్షల నిధులు వారికి అందాయని, వాటిని సీజ్ చేసినట్టు ఎన్‌ఐఏ కోర్టుకు తెలిపింది.

జనవరి 22వ తేదీన దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో సోదాలు నిర్వహించి, ఐఎస్ సానుభూతి పరులైన 18 మందిని అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ వీరందరికి సిరియా నుంచి షఫీ ఆర్మర్ ఆదేశాలు, సూచనలు చేసేవాడు. కర్ణాటకలోని తుమ్కూ ర్, బెంగుళూర్, హైదరాబాద్‌లోని దర్గాలు, నిందితుల ఇండ్లు, వారి బంధువుల ఇండ్లలో సమావేశమయ్యేవారని ఎన్‌ఐఏ వెల్లడించింది.

ఇందుకు సంబంధించిన శాస్త్రీయమైన సాక్ష్యాలు, వాయిస్ శాంపిల్స్‌ను సేకరించినట్టు దర్యాప్తు సంస్థ కోర్టుకు విన్నవించింది. నిందితులు నక్సలైట్లతో మాట్లాడారని, నక్సలైట్ల మోడస్ ఆపరెండీ గురించి తెలుసుకున్నారని ఎన్‌ఐఏ వివరించింది. ఈ క్రమంలోనే నక్సలైట్లతో ఆయుధాలు కొనుగోలు చేయాలని పథక రచన చేశారని, నిందితులు ఈ విషయాలను విచారణలో వెల్లడించారని ఎన్‌ఐఏ తన చార్జిషీట్‌లో చెప్పింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In its supplementary chargesheet filed on Tuesday in New Delhi’s Patiala Court, the National Investigation Agency revealed that the Hyderabad ISIS terror suspects, who had been arrested in January this year, had contacted Naxals.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి