రూ.500 కోట్ల ఆస్తులు!: టిడిపి నుంచి గెలిచి, తెరాసలో చేరిన ఎమ్మెల్యేపై కేసు
రూ.500 కోట్లకు మించి లెక్క చూపిని ఆస్తులు కలిగి ఉన్నారని, ఇందుకు సంబంధించి నారాయణపెట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పైన ఆదాయపన్ను శాఖ కేసులు నమోదు చేసింది.
హైదరాబాద్: రూ.500 కోట్లకు మించి లెక్క చూపిని ఆస్తులు కలిగి ఉన్నారని, ఇందుకు సంబంధించి నారాయణపెట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పైన ఆదాయపన్ను శాఖ కేసులు నమోదు చేసింది.
కర్నాటకలో ఒక మెడికల్ కళాశాలతో పాటు పలు విద్యాసంస్థలు కలిగి ఉన్న రాజేందర్ రెడ్డి.. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నారాయణపేట అసెంబ్లీ నుంచి టిడిపి తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఇటీవలె అధికార తెరాసలో చేరారు.

అయితే, ఆ తర్వాత ఆదాయానికి మించి ఆస్తులన్నాయన్న సమాచారం మేరకు ఐటీ శాఖ 2015 డిసెంబర్ నెలలో ఆయన నివాసాలు, కార్యాలయాలలో తనిఖీలు చేసింది. ఆ దాడులలో రూ.20 కోట్ల నగదుతో పాటు వందల కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి.












Click it and Unblock the Notifications