హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పన్ను ఎగవేతదారులు: తెలుగు రాష్ట్రాల నుంచి 14 మంది, కానీ

ప్రభుత్వానికి పన్నులు ఎగవేసిన 29 మంది డిఫాల్టర్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 14 మంది ఉన్నారు. అందులో 9 మంది హైదరాబాద్ చిరునామాగా చూపించగా, 5గురు వైజాగ్ చిరునామాతో ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వానికి పన్నులు ఎగవేసిన 29 మంది డిఫాల్టర్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 14 మంది ఉన్నారు. అందులో 9 మంది హైదరాబాద్ చిరునామాగా చూపించగా, 5గురు వైజాగ్ చిరునామాతో ఉన్నారు.

ప్రభుత్వానికి పన్ను ఎగవేసిన వారు మొత్తం 29. వీరంతా కలిసి 448.02 కోట్ల మేర పన్నులు ఎగ్గొట్టినట్లు ఆదాయపన్ను శాఖ బయటపెట్టింది. ఉద్దేశ్యపూర్వకంగా ఆదాయపన్ను, కార్పోరేట్ పన్నులు ఎగవేస్తున్న వారి పేర్లను బట్టబయలు చేసి వారి పరువును రచ్చకీడ్చే వ్యూహంలో భాగంగా ఈ పేర్లను బయటపెట్టారు.

tax defaulters

ఇందులో వ్యక్తులతో పాటు సంస్థలు ఉన్నాయి. 29 మందిలో 26 మంది ఆచూకీ తెలియని వ్యక్తులు, సంస్థల విభాగంలో ఉన్నారు. 29 మందిలో తెలుగువారు 14 మంది డిఫాల్టర్లు ఉన్నప్పటికీ.. బకాయీల్లో వీరి వాటా మాత్రం రూ.55.72 కోట్లు.

సంస్థలు ఎగవేతలకు పాల్పడిన కేసుల్లో డైరెక్టర్ల పేరును ప్రకటనలో పేర్కొన్నారు. పాన్ నెంబర్, చివరిసారిగా తెలిసిన అడ్రస్, ఏయే అసెస్‌మెంట్ సంవత్సరాల్లో పన్ను ఎగవేశారు, ఎంత మొత్తం ఎగవేశారు.. తదితర వివరాలున్నాయి.

ఇక, మొత్తం రూ.448 కోట్ల బకాయిలలో సగం పైగా ఒకే వ్యక్తి పేరిట ఉన్నాయి. లక్నోకు చెందిన ఇర్ఫాన్ హబీబ్ రూ.257.44 కోట్ల ఆదాయపన్ను ఎగవేసినట్లుగా వెల్లడించారు.

English summary
The Income Tax department today released a list of 29 entities owing Rs 448.02 crore in taxes as part of its strategy to name and shame large defaulters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X