హైదరాబాద్‌లోను 'హోదా' గళం: గొంతెత్తిన ఐటీ ఉద్యోగులు..
'వియ్ వాంట్ స్పెషల్ స్టేటస్'అంటూ నినదించారు. ప్రత్యేక హోదా వస్తేనే ఏపీకి పెట్టుబడులు వస్తాయని, తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం ఏపీ యువత పట్టుబడుతున్న తరుణంలో.. తెలంగాణ నేతల నుంచి సైతం ఏపీ హోదాకు మద్దతు లభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోను హోదా గళం వినిపిస్తోంది.
తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేబీఆర్ పార్కు ఎదుట ఐటీ ఉద్యోగులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. 'వియ్ వాంట్ స్పెషల్ స్టేటస్'అంటూ నినదించారు. ప్రత్యేక హోదా వస్తేనే ఏపీకి పెట్టుబడులు వస్తాయని, తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు.

హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముందని ఈ సందర్బంగా ఐటీ ఉద్యోగులు సూచించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ఐటీ ఉద్యోగులు పాల్గొని తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. కాగా, టీఆర్ఎస్ ఎంపీ కవిత, తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, మరో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ వంటి నేతలు సైతం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications