వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ పరువు తీశాడు, దొంగ రేవంత్ ఏం చేయలేడు: కేటీఆర్ సంచలనం

కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పుడు, రేపు, ఇంకెప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పుడు, రేపు, ఇంకెప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

సేఫ్ గేమ్ ఆడుతున్నారా?: 'రేవంత్ సూపర్, కేసీఆర్! గుణపాఠం నేర్చుకో'సేఫ్ గేమ్ ఆడుతున్నారా?: 'రేవంత్ సూపర్, కేసీఆర్! గుణపాఠం నేర్చుకో'

బుధవారం తెలంగాణ భవన్‌లో మంత్రులు కేటీఆర్‌, మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి సమక్షంలో కొడంగల్‌ నియోజకవర్గంలోని టీడీపీ, కాంగ్రెస్‌‌లకు చెందిన మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, నేతలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

టీడీపీకి షాక్: రేవంత్ కోసం ఏడ్చిన నేత టీఆర్ఎస్‌లోకి, కేసీఆర్‌తో భేటీ, వారే చక్రం తిప్పారుటీడీపీకి షాక్: రేవంత్ కోసం ఏడ్చిన నేత టీఆర్ఎస్‌లోకి, కేసీఆర్‌తో భేటీ, వారే చక్రం తిప్పారు

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటేసిన కొడంగల్ ప్రజల పరువును తీశారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సీమాంధ్రబాబు చెప్పు చేతల్లో తొత్తుగా వ్యవహరించారన్నారు.

రేవంత్ రెడ్డి కూడా అడ్డుకోలేడు

రేవంత్ రెడ్డి కూడా అడ్డుకోలేడు

వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌ నియోజకవర్గం నుంచే గులాబీ దండయాత్ర మొదలవుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాహులే కాదు వాళ్ల జేజమ్మ వచ్చినా తమ విజయాన్ని అడ్డుకోలేరని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తెలంగాణకు మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

 తెలంగాణ పరువు తీశాడు

తెలంగాణ పరువు తీశాడు

ఓటుకు నోటు కేసుతో ఎమ్మెల్యే రేవంత్ తెలంగాణ పరువు తీశారని ధ్వజమెత్తారు. రూ.50 లక్షలతో జైల్లో చిప్పకూడు తిన్న గజదొంగ అని, దొంగలను చేర్చుకునే దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టిందన్నారు. రేవంత్ కాంగ్రెస్‌లో చేరి కుటుంబ పాలన అంటూ మాట్లాడటం చూసి అంతా నవ్వుకుంటున్నారన్నారు. రాహుల్‌ది కుటుంబపాలన కాదా? ఉత్తమ్‌, ఆయన భార్య ఎమ్మెల్యేలుగా ఉండడాన్ని ఏమంటారని ప్రశ్నించారు.

 గతిలేక కాంగ్రెస్‌లో చేరాడు

గతిలేక కాంగ్రెస్‌లో చేరాడు

రేవంత్ రెడ్డికి గతిలేకే కాంగ్రెస్‌లో చేరాడని కేటీఆర్ అన్నారు. ప్రజలు రెండుసార్లు గెలిపిస్తే ఏం చేశాడని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొంటూ దొరికిపోయాడని, కాంగ్రెస్‌ తెలంగాణకు తీరని ద్రోహం చేసిందని, 2014లో ప్రజలు చీపుర్లతో కొడతారని భయపడి తెలంగాణ ఇచ్చారన్నారు.

 అంతా కాంగ్రెస్ వల్లే

అంతా కాంగ్రెస్ వల్లే

పాలమూరు నుంచి ముంబై వలసలకు కాంగ్రెస్‌ వాళ్లే కారణమని కేటీఆర్ దుమ్మెత్తి పోశారు. రెండు లక్షల మంది నల్గొండ ప్రజల ఫ్లోరైడ్‌ బాధలకు పాలమూరు మాజీ మంత్రే బాధ్యుడు అన్నారు. కొడంగల్‌లో టీఆర్ఎస్ వచ్చాకే అభివృద్ధి ప్రారంభమైందన్నారు.

 గుర్నాథ్ రెడ్డి ఐదుసార్లు గెలిచినా మంత్రి పదవి ఇవ్వలేదు

గుర్నాథ్ రెడ్డి ఐదుసార్లు గెలిచినా మంత్రి పదవి ఇవ్వలేదు

గుర్నాథరెడ్డి అయిదుసార్లు ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్‌ పార్టీ మంత్రి పదవి ఇవ్వలేదని, దగా చరిత్ర గల కాంగ్రెస్‌కు తెలంగాణలో స్థానమే లేదని, కొడంగల్‌ అభివృద్ధికి అన్ని విధాల చేయూతనిస్తామన్నారు. స్వార్థరాజకీయాలకు రేవంత్ ప్రతీక అని జూపల్లి కృష్ణారావు అన్నారు.

రేవంత్ ఏం చూసి కాంగ్రెస్‌లోకి వెళ్లారు

రేవంత్ ఏం చూసి కాంగ్రెస్‌లోకి వెళ్లారు

రేవంత్ ఏమి చూసి కాంగ్రెస్‌లోకి పోయారో చెప్పాలని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. ఎన్టీఆర్ పౌరుషమని చెబుతున్న రేవంత్‌కు తెలంగాణ ఉద్యమం సమయంలో ఆ పౌరుషం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు ఆంధ్రా నాయకులకు అంకితమై వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్నారు.

English summary
Telangana IT Minister KT Rama Rao on Wednesday lashed out at Kodangal MLA Revanth Reddy, who joined Congress. He dragged again Vote for Cash case. Many TDP and Congress leaders joined TRS on Wednesday in the presence of Minister KT Rama Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X