హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండోరోజు హైదరాబాద్లో కొనసాగుతున్న ఐటీ దాడులు: ఆ సంస్థలతో పాటు టార్గెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!!

రెండోరోజు హైదరాబాద్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఆస్తులపై దాడులు కొనసాగుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో రెండవ రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ సంస్థను టార్గెట్ చేసిన ఐటీ అధికారులు వసుధ ఫార్మా కెమ్ చైర్మన్ వెంకటరామరాజు తోపాటు సదరు సంస్థకు చెందిన సీఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు ఇల్లు కార్యాలయాలపై నిన్న దాడులు చేశారు. మొత్తం 50 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు వరుసదాడులతో హడలెత్తించారు. ఇక రెండవ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి ఇంటి పైన, రాజ పుష్ప, వసుధ, వర్టేక్స్, ముప్పా సంస్థల పైన దాడులు జరిపిన ఐటీ అధికారులు ఈరోజు మరికొన్ని చోట్ల తనిఖీలను చెయ్యనున్నారు. దాదాపు 50 బృందాలు ఈ తనిఖీలలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఐటి అధికారులు రామచంద్రపురం సమీపంలోని తెల్లాపూర్ లో రాజ పుష్ప లైఫ్ స్టైల్ కాలనీలో నివాసం ఉంటున్న సిద్దిపేట మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో తనిఖీలు జరిపారు. కాలనీ గేట్లు మూసివేసి మరీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో సోదాలను నిర్వహించారు ఐటీ అధికారులు.

ముఖ్యంగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని టార్గెట్ చేసిన ఐటీ అధికారులు

ముఖ్యంగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని టార్గెట్ చేసిన ఐటీ అధికారులు


ఐటీ అధికారుల సోదాలు కొత్త కాకపోయినా ఏకకాలంలో మూడు స్థిరాస్తి సంస్థల పైన, ఒక ఔషధ సంస్థకు చెందిన కార్యాలయాల పైన దాడులు చేసే తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా రాజ పుష్ప వ్యవస్థాపకుల్లో ఒకరైన సిద్దిపేట మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని టార్గెట్ చేసిన ఐటి అధికారులు ఇటీవల వెంకటరామిరెడ్డి కుమారుడి వివాహం జరగగా, దానికైనా ఖర్చు గురించి ఆరా తీశారు. అంతేకాదు నానక్ రామ్ గూడా లో ఉన్న రాజ పుష్ప సమ్మిట్ పేరుతో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సంస్థ లావాదేవీల పైన తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కీలకమైన పత్రాలను, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు.

ముప్పా సంస్థ, వర్టేక్స్ సంస్థ కార్యాలయాల్లో, బాధ్యుల ఇళ్ళలో సోదాలు

ముప్పా సంస్థ, వర్టేక్స్ సంస్థ కార్యాలయాల్లో, బాధ్యుల ఇళ్ళలో సోదాలు


ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముప్పా సంస్థలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. గచ్చిబౌలిలో జనార్దన్ హిల్స్ లో ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం తో పాటు ఈ సంస్థ వేసిన వెంచర్ల వద్ద ఉన్న కార్యాలయాలు, సంస్థ ఎండి, డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక వర్టేక్స్ సంస్థ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. కొత్త గూడా లోని జూబ్లీ ఎంక్లేవ్ కాలనీలో ఉన్న సంస్థ కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఈ సంస్థ లావాదేవీలపై తనిఖీలు నిర్వహించారు.

నేడు కూడా కొనసాగుతున్న ఐటీ దాడులు

నేడు కూడా కొనసాగుతున్న ఐటీ దాడులు


ఇక వెంగళరావు నగర్ ప్రధాన కేంద్రంగా ఉన్న వసుధ ఫార్మ కెమ్ లిమిటెడ్ కార్యాలయంలోనూ, మాదాపూర్ లోని కావూరి హిల్స్ కాలనీలో ఉన్న వంశీరామ్ జ్యోతి గెలాక్సీ భవనంలోని కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. వసుధ చైర్మన్ వెంకటరామ రాజుతో పాటు డైరెక్టర్ల నివాసాలలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు, నేడు కూడా హైదరాబాద్లోని అనేక ప్రాంతాలలో రెండవ రోజు దాడులు కొనసాగిస్తున్నారు.

English summary
IT officials are continuing raids for the second day in Hyderabad today. Around 50teams are continuing searches. BRS MLC Venkatramireddy's house, Rajapushpa company, Vasudha Pharma, Muppa and Vertex companies were searched.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X