హైదరాబాద్లో ఏకకాలంలో 30 చోట్ల ఐటీ దాడులు.. టార్గెట్ ఆయనేనా!
నేడు హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ కార్పొరేట్ కార్యాలయాల పైన నేడు తెల్లవారుజాము నుంచే ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఐటీ సోదాలలో భాగంగా ఆయా కంపెనీలలో పనిచేస్తున్న సిబ్బందిని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ తో పాటు అక్కడ ఏకకాలంలో ఐటీ దాడులు
ఇక ఈ ఐటీ దాడులలో భాగంగా ఆయా కంపెనీలకు చెందిన మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్ల నివాసాల పైన కూడా ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్, రాయదుర్గం, కొల్లూరు, సంగారెడ్డి లోని కార్యాలయాల పైన ఏకకాలంలో ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

వారి ఇళ్ళలో, బంధువులు, స్నేహితుల ఇళ్ళలోనూ తనిఖీలు
గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ అధినేత అక్బర్ షేక్ ఇంట్లోనూ ఆయన కార్యాలయాలలోనూ ఐటీ దాడులు సాగుతున్నాయి. అన్విత బిల్డర్స్ అధినేత అచ్యుతరావు ఇంట్లోనూ, బొప్పన శ్రీనివాస్, బొప్పన అనూప్ ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. అంతేకాదు వారి సన్నిహితుల, వారి కంపెనీలలో పనిచేసే కీలక ఉద్యోగుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తున్నారు.
30 ప్రాంతాలలో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు
మొత్తం హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని 30 ప్రాంతాలలో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను ఎగవేత, లెక్కల్లో చూపని ఆదాయం వంటి ఆరోపణలతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. గడచిన రెండు ఆర్థిక సంవత్సరాలుగా ఆయా కంపెనీలపైన ఆరోపణలు వెల్లువగా మారిన నేపథ్యంలో ఐటి అధికారులు దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది.
గూగీ ప్రాపర్టీస్ అధినేత కాంగ్రెస్ నాయకుడు
అయితే గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ అధినేత అక్బర్ షేక్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు కావడం గమనార్హం. గత ఎన్నికలలో మలక్పేట నియోజకవర్గం నుంచి ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న దాడులు ఎవరిని టార్గెట్ చేస్తూ జరుగుతున్న దాడులు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.ఇలాగే గతంలో కూడా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రముఖులను టార్గెట్ చేస్తూ ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications