పొంగులేటి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు - నేడే నామినేషన్..!!
మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి ఇంటిపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఖమ్మంలోని పొంగులేటి ఇల్లు, కార్యాలయంలో ఐటీ తనిఖీలు చేపట్టింది. వేకువజామున 3 గంటల నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. 8 వాహనాల్లో ఐటీ అధికారులు వచ్చి ఈ దాడుల్లో పాల్గొన్నారు. పొంగులేటి సిబ్బంది ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనపై ఐటీ దాడులు జరుగుతాయని పొంగులేటి రెండు రోజుల క్రితమే వెల్లడించారు.
కొనసాగుతున్న ఐటీ దాడులు:కాంగ్రెస్ నేత పొంగులేటి నివాసాలు- కార్యాలయాల్లో ఐటీ, ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మంతో పాటుగా హైదరాబాద్ నందగిరి హిల్స్ లోని వంశీరామ్ జ్యోతి హిల్ రిట్జ్ ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నేడు పొంగులేటి నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. దాడుల నేపథ్యంలో పొంగులేటి నివాసానికి భారీగా అనుచరులు చేరుకుంటున్నారు. పొంగులేటి ఇంటి వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. నామినేషన్ కోసం పొంగులేటి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేందుకు సిద్దమయ్యారు. సరిగ్గా నామినేషన్ కు సిద్దమవుతున్న సమయంలో ఈ దాడుల వ్యవహారం సంచలనంగా మారుతోంది.

ముందే చెప్పిన పొంగులేటి:కాగా, తన పైన ఐటీ దాడుల గురించి పొంగులేటి ముందుగానే వెల్లడించారు. కొద్ది రోజుల్లోనే తనపై, తన కుటుంబ సభ్యులపై ఐటీ దాడులు జరుగుతాయని ఈ మధ్య కాలంలోనే చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నాయకులకు కొద్ది రోజులు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు బిఆర్ఎస్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బిజెపి, బిఆర్ఎస్ కుమ్మక్కై తన మీద ఐటీ దాడులు చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు. బిఆర్ఎస్, బిజెపిలు ఒకటే.. రెండు పార్టీలు గల్లీలో కొట్టుకుంటూ కనిపించినా.. ఢిల్లీలో కలిసిపోతాయని పేర్కొన్నారు.
రాజకీయ కలకలం:ఇక, ఇప్పుడు పొంగులేటి ముందుగా చెప్పినట్లుగానే ఇప్పుడు ఐటీ దాడులు కొనసాగుతుండటంతో రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. కొద్ది రోజుల క్రితం మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్ది కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తో పాటుగా కాంగ్రెస్ నేతల ఇళ్ల పైన ఐటీ దాడులు జరిగాయి. ఎన్నికల సమయంలో జరుగుతన్న ఈ దాడుల పైన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్.. బీజేపీ పైన ఆరోపణలు చేస్తోంది. అయితే, ఈ దాడులతో తమకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. నాలుగు రోజుల క్రితం తుమ్మల..ఇప్పుడు పొంగులేటి పైన ఐటీ దాడుల వ్యవహారం ఎన్నికల వేళ రాజకీయ ఉత్కంఠను పెంచుతోంది. ఈ దాడుల పైన ఐటీ అధికారులు ఏం చెబుతారనేది కీలకంగా మారుతోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications