వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాసలోకి టిడిపి ఆనంద్: బిజెపితో టిక్కెట్ చిచ్చు, సుజనాకు షాక్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమి పొత్తు ఖరారయింది. బిజెపి 63, టిడిపి 87 డివిజన్లలో పోటీ చేయనుంది. మనకు బలమున్న చోట బిజెపికి కేటాయించారని తెలుగుదేశం తమ్ముళ్లు ఆందోళన చేపట్టారు.

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మిత్రపక్షాలైన టిడిపి, బిజెపి మధ్య సీట్ల సర్దుబాటుపై చిచ్చు ఎన్నికల నామినేషన్ ముగేసే ఆదివారం నాటికి కూడా సద్దుమణగ లేదు. శనివారం నాడు ఆశావాహుల ఆందోళనలు, నిరసనలతో రెండు పార్టీల కార్యాలయాలు హోరెత్తాయి.

గత ఎన్నికల్లో విజయం సాధించిన, బలమైన డివిజన్లను పంపకానికి ఎలా పెడతారంటూ రెండు పార్టీల్లోనూ ఆశావహులు, అనుచరులు నిలదీస్తున్నారు. దీంతో సంఖ్యాపరంగా సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చినా, ఏడే డివిజన్లు ఎవరు తీసుకోవాలన్న అంశంపై రెండు పార్టీల్లో ముఖ్య నేతలకు తలనొప్పిగా మారింది.

 టిడిపి - బిజెపి

టిడిపి - బిజెపి

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ఘట్టం ముగుస్తుండగా, పంపకాల విషయంలో శనివారం పొద్దుపోయే వరకూ కూడా రెండు పార్టీల నేతలు చర్చల్లో తలమునకలై ఉన్నారు. నేతలు తేల్చుకోలేక శనివారం బాగా పొద్దుపోయే వరకూ చర్చించారు.

టిడిపి - బిజెపి

టిడిపి - బిజెపి

అయితే నామినేషన్ దాఖలు చేసిన తర్వాత బి-ఫారంను ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా దాఖలు చేసేందుకు అవకాశం ఉన్నందున నేతలకు కొంత ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది.

టిడిపి - బిజెపి

టిడిపి - బిజెపి

బాగా ఒత్తిడి ఉన్న ఆశావాహులతో ముందు జాగ్రత్తగా నామినేషన్లు వేయిస్తున్నారు. తెరాసతో ఆంతరంగికంగా పొత్తు కుదుర్చుకున్న మజ్లిస్ పార్టీ తమ జాబితాను మీడియాకు విడుదల చేయకుండానే, అభ్యర్థులను పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని, నామినేషన్ వేయాల్సిందిగా సూచిస్తున్నారు.

 టిడిపి - బిజెపి

టిడిపి - బిజెపి

తెలుగుదేశం పార్టీ నేతలు మిత్రపక్షమైన బిజెపి నేతలతో రెండు రోజులుగా జరిపిన చర్చలు కొలిక్కి రావడం లేదు. శనివారం రాత్రి కొలిక్కి వచ్చాయి.

 టిడిపి - బిజెపి

టిడిపి - బిజెపి

డివిజన్ల ఎంపిక కూడా ఆ పార్టీలకు గగనమైంది. ప్రతి డివిజన్ వద్దకు వచ్చేసరికి ఇది తమకు కావాలంటే, తమకు కావాలని ఇరు పార్టీల నేతలు పట్టుబడుతున్నారు.

 టిడిపి - బిజెపి

టిడిపి - బిజెపి

ఆ డివిజన్ తమకు అనుకూలంగా ఉందని, పైగా బలమైన అభ్యర్థి ఉన్నాడని ఇరు పార్టీల నేతలు గట్టిగా చెప్పడంతో, ఏదీ తేల్చుకోలేకపోతున్నారు.

 టిడిపి - బిజెపి

టిడిపి - బిజెపి

గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమ పార్టీ తొమ్మిది నియోజకవర్గాలను కైవసం చేసుకున్నామన్న విషయాన్ని మరిచిపోరాదని టిడిపి చెప్పగా, తెలంగాణలో టిడిపి బలం తగ్గిందని బెజిపి చెప్పింది. ఎట్టకేలకు శనివారం రాత్రి ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది ఖరారయింది.

 టిడిపి - బిజెపి

టిడిపి - బిజెపి

పొత్తులో భాగంగా తమ డివిజన్ బిజెపికి కేటాయించారని తెలుసుకున్న శేరిలింగంపల్లి, మాదాపూర్, గన్‌ఫౌండ్రీ, హిమయత్ నగర్ డివిజన్లకు చెందిన కార్యకర్తలు శనివారం నాడు నిరసన వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యే వివేకానంద టిడిపి నేతలను సముదాయించే ప్రయత్నం చేశారు.

 టిడిపి - బిజెపి

టిడిపి - బిజెపి

టిడిపి గ్రేటర్ శాఖ మాజీ అధికార ప్రతినిధి ఆనంద్ కుమార్ గౌడ్ హఠాత్తుగా తెరాసలో చేరారు. గన్ ఫౌండ్రీ డివిజన్ నుంచి టిడిపి టిక్కెట్ ఆశించిన ఆయన.. టిడిపి - బిజెపి కూటమిలో భాగంగా ఆ సీటు బిజెపికి కేటాయించడంతో నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో ఆయన తెరాసలో చేరారు.

అసంతృప్తుల సెగ

అసంతృప్తుల సెగ

అధికార తెరాసకు, విపక్ష కాంగ్రెస్, బిజెపి, టిడిపిలకు అసంతృప్తుల సెగ తగులుతోంది. తమకు టిక్కెట్ రాలేదని తెరాస, బిజెపి, టిడిపి, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద ఆశావహులు ఆందోళనకు దిగే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.

అసంతృప్తుల సెగ

అసంతృప్తుల సెగ

ఆదివారం మూడు గంటలకు నామినేషన్ పర్వం ముగుస్తున్నా.. బిజెపి - టిడిపి, కాంగ్రెస్‌లు అసంతృప్తుల భయంతో అభ్యర్థులను ప్రకటించలేదు. నేరుగా ఫోన్ చేసి చెబుతున్నాయని తెలుస్తోంది. అభ్యర్థుల జాబితాను సుజనాచౌదరి కార్యాలయంలో ప్రకటిస్తున్నారనే విషయం తెలుసుకొని.. ఆయనను అడ్డుకున్నారు.

English summary
The ‘rebel trouble’ is keeping the TDP-BJP combine on its toes. Though the problem of rebels is likely to hit all the parties, the TDP-BJP alliance fears that it will be the worst hit in case rebels join the GHMC electoral battle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X