అది ఫెడరల్ ఫ్రంట్ కాదు.!ఫెడప్ ఐన ఫ్రంట్..!కేసీఆర్ కూటమి పై మండిపడ్డ రాములమ్మ..!!
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలపట్ల, తెలంగాణ ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, స్ఠార్ క్యాంపెయినర్ విజయశాంతి మరో సారి మండిపడ్డారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రత్యామ్నాయ కూటమి అవసరమని, అందుకోసం జాతీయ నాయకుల మద్దత్తు కూడగడతానని దేశం మొత్తం తిరిగొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రికి నిరాశే ఎదురయ్యిందని విజయాశాంతి ఆరోపించారు. మూడవ ఫ్రంట్ అంశంలో చంద్రశేఖర్ రావును జాతీయ నేతలు విశ్వశించకపోవడంతో వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులకు పాల్పడ్డారని విమర్శించారు.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశమంతా తిరిగి చివరకు వైసీపీ మద్దతు మాత్రమే పొందగలిగారనే విషయం అర్థమయిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కలిసిన బెంగాల్ సీఎం మమత బెనర్జీ, కర్నాటక సీఎం హెచ్ డీ. కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, ఎం.కే స్టాలిన్ వంటి నేతలు కోల్ కతా లో జరిగిన మహాకూటమి సభకు హాజరయి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కి మద్దతు పలికారని గుర్తు చేశారు. అంటే టీఆర్ఎస్ నేతృత్వంలో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాన పార్టీల మద్దతు లేకుండా ఏర్పడబోయే ఫ్రంట్ ను ఫెడరల్ ఫ్రంట్ అనడం కంటే ఫెడప్ ఫ్రంట్ అనాలని రాములమ్మ తేల్చి చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications