బై.. బై.. హైదరాబాద్! ముగిసిన ఇవాంకా పర్యటన, ఈ రాత్రి దుబాయ్‌కి.. అక్కడ్నించి అమెరికాకు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాదు నుంచి సెలవు తీసుకుంటున్నారు. రెండు రోజులపాటు హైదరాబాదులో ఉల్లాసంగా గడిపిన ఆమె బుధవారం రాత్రి అమెరికా బయలుదేరారు.
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాదు నుంచి సెలవు తీసుకుంటున్నారు. రెండు రోజులపాటు ఆమె హైదరాబాదులో ఉల్లాసంగా, బిజీగా గడిపారు.
ఈ రెండ్రోజులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఇవాంకా బుధవారం రాత్రి ట్రైడెంట్ హోటల్ నుంచి నేరుగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరారు.
Recommended Video

GES 2017 : Hyderabad's First Citizen Not Invited | Oneindia Telugu

కాసేపట్లో ఫై ఎమిరేట్స్ విమానంలో ఆమె దుబాయ్ కి బయల్దేరనున్నారు. అక్కడి నుంచి ఆమె అమెరికా చేరనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాదు తన మనసుని హత్తుకుందని ఆమె తెలిపారు.
హైదరాబాద్‌లో గడిపిన ఈ రెండు రోజులు చాలా బాగున్నాయని ఇవాకం తెలిపారు. కాగా, యూఎస్ నుంచి నేరుగా హైదరాబాదుకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమె, తిరుగు ప్రయాణంలో దుబాయ్ వెళ్లి మళ్లీ అక్కడ్నించి అమెరికా వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications