ఇవాంకా హైద్రాబాద్ స్పీచ్‌పై విమర్శలు: పాత స్పీచ్ రీ సైకిల్, మీడియాలో రచ్చ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జీఈఎస్ 2017 సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇవాంకా ట్రంప్ ఉపన్యాసం తన పాత ప్రసంగాన్ని కొద్దిగా మార్చారని అంతర్జాతీయ మీడియా విమర్శలు చేసింది. పాత ప్రసంగాన్ని జీఈఎస్ సదస్సులో ఇవాంకా ట్రంప్ వల్లె వేశారని మీడియా ప్రస్తావించింది.

గోల్కోండ కోటను చూసి థ్రిల్లయ్యా: ఇవాంకా ట్రంప్ ట్వీట్

జీఈఎస్ 2017 సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సును అమెరికా, ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి.ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడి సలహదారు ఇవాంకా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

షాక్: ఇవాంకా హైద్రాబాద్ డ్రెస్ ఖర్చులతో కారు కొనొచ్చు

జీఈఎస్ 2017 సదస్సు ప్రధానంగా మహిలా పారిశ్రామిక వేత్తలపై ఫోకస్ చేసింది. అయితే ఈ సదస్సులో ఇవాంకా ట్రంప్ పాల్గొనడంతో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహించే రీతిలో ఆమె ప్రసంగం ఉందని భావించారు. అయితే ఈ ప్రసంగం పాత ప్రసంగమేనని మీడియా గుర్తు చేసింది.

ఇవాంకా ట్రంప్‌కు టిఆర్ఎస్ టిక్కెట్టు: రాత్రికి రాత్రే రోడ్లు,రాజశేఖర్ వీడియో వైరల్

ఇవాంకా ట్రంప్ పాత ప్రసంగమే

ఇవాంకా ట్రంప్ పాత ప్రసంగమే

జీఈఎస్ 2017 సదస్సులో ఇవాంకా ట్రంప్ పాత ప్రసంగాన్నే చేసిందని మీడియా విమర్శలు గుప్పించింది. ఇవాంకా ట్రంప్ ప్రసంగంపై ఇదే చర్చ సాగుతోంది.

గత నెల 2న టోక్యోలో జరిగిన వరల్డ్ అసెంబ్లీ ఫర్ విమెన్ (వావ్)'లో చేసిన ప్రసంగాన్నే కాస్త అటు ఇటుగా మార్చి హైదరాబాద్‌లో ఇవాంకా చదివేశారని ‘న్యూస్‌వీక్' పత్రిక పేర్కొంది. ఆమె ప్రసంగంలోని కొన్ని చిన్నచిన్న పదాలు తప్ప మిగతావన్నీ సేమ్ టు సేమ్ అని పేర్కొంది.

కొత్త పదాలను ఉపయోగించిన ఇవాంకా

కొత్త పదాలను ఉపయోగించిన ఇవాంకా


జీఈఎస్ 2017 సదస్సులో ఇవాంకా ట్రంప్ కొన్ని పదాలను అటు ఇటు మార్చారని మీడియా ప్రస్తావించింది. ఈ ముత్యాల నగరిలో గొప్ప నిధి మీరే లాంటి చిన్నచిన్న పదాలు మాత్రమే కొత్తగా వాడారని మీడియా గుర్తు చేసింది. మహిళలు పనిచేస్తే దాని ప్రభావం ద్విగుణీకృతం అవుతుందని ఇవాంకా ట్రంప్ కొత్త పదాలను ఉపయోగించారని గుర్తు చేసింది.

టోక్యో ప్రసంగం యథాతథంగా

టోక్యో ప్రసంగం యథాతథంగా

పురుషుల కంటే మహిళలే మహిళలకు ఎక్కువ ఉపాధి ఇవ్వగలుగుతారు అన్న వాక్యాలను పూర్తిగా టోక్యో ప్రసంగం నుంచి యథాతథంగా తీసుకున్నారని కథనంలో పేర్కొంది. మహిళలు వారి సంపాదనను తిరిగి సమాజంలోనే పెట్టుబడిగా పెడతారన్న వాక్యాలు కూడా అక్కడివేనని వివరించింది.

ఇవాంకా ట్రంప్ ప్రసంగంపై ఇలా

ఇవాంకా ట్రంప్ ప్రసంగంపై ఇలా

ఇవాంకా ట్రంప్‌ రీసైకిల్స్‌ హెర్‌ ఓన్‌ స్పీచ్‌ ఇన్‌ ఇండియా‘ శీర్షికతో న్యూస్ వీక్' ప్రచురించిన కథనంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులు ప్రసంగించేటప్పుడు కొన్ని వాక్యాలు పునరావృతం కావడమనేది చాలా సహజమైన విషయమని దానిని తప్పుబట్టాల్సిన అవసరం లేదంటూ ఇవాంకాను కొందరు వెనకేసుకొస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The recycled speech drew criticism from international news outlets, with Quartz India writing the headline "Parts of Ivanka Trump's Hyderabad speech sounded a lot like the one she gave in Tokyo

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి