వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్ రంగంలో కేసీఆర్ పీహెచ్డీ చేస్తే.. ప్రజలపై ప్రభుత్వ బకాయిల కరెంట్ బిల్లుల భారమేల?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలు, డిస్కం తప్పిదాలు జరిగాయని, ప్రజలపై కరెంట్ బిల్లుల మోయలేని పెను భారం మోపుతున్నారని ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే, అసలు సీఎం కేసీఆర్ వంటి విద్యుత్ రంగంపై పట్టున్న గొప్ప నాయకుడు ఎవరూ లేరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

900మందికి ఒకే టాయిలెట్టా.. ముఖ్యమంత్రి కేసీఆర్ బతికే ఉన్నారా?900మందికి ఒకే టాయిలెట్టా.. ముఖ్యమంత్రి కేసీఆర్ బతికే ఉన్నారా?

 జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలకు షర్మిల లెక్కలకు పొంతన లేదు

జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలకు షర్మిల లెక్కలకు పొంతన లేదు


విద్యుత్ రంగంపై సీఎం కేసీఆర్ కు ఉన్నంత పట్టు దేశంలో మరే ఇతర నాయకులకు లేదని, విద్యుత్తు రంగంలో ఆయన పీహెచ్డీ చేశారని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఇంధన పొదుపు పురస్కారం మొదట సీఎం కేసీఆర్ కి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్న ఆయన హైదరాబాద్లో నిర్వహించిన ఇంధన పొదుపు పురస్కారాలు 2022 ప్రధానోత్సవంలో మాట్లాడారు. ఇక సీఎం కేసీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలకు, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితికి పొంతన లేదని తాజాగా వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతుంది.

 తెలంగాణా విద్యుత్ సమస్యలపై షర్మిల ఫైర్

తెలంగాణా విద్యుత్ సమస్యలపై షర్మిల ఫైర్


సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సమస్యలపై ప్రశ్నించిన వైఎస్ షర్మిల ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బకాయిలు, కాళేశ్వరం ప్రాజెక్టు లో నీళ్లను ఎత్తి పొయ్యడానికి చేసిన విద్యుత్ వినియోగం తాలూకా బిల్లుల భారాన్ని ప్రజలపై రుద్దుతున్నారు అని మండిపడ్డారు. విద్యుత్ లైన్ల లోపాలకు.. కరెంట్ కొనుగోళ్ల అవకతవకలకు ..డిస్కం తప్పిదాలకు .. సర్కార్ చెల్లించాల్సిన బకాయిలకు జనాన్ని బలి చేస్తారా? జనం నడ్డి విరిచేస్తారా? అంటూ టార్గెట్ చేశారు.

ప్రజల నెత్తి మీద విద్యుత్ భారం పెడతావా అంటూ ప్రశ్నించిన షర్మిల

ప్రజల నెత్తి మీద విద్యుత్ భారం పెడతావా అంటూ ప్రశ్నించిన షర్మిల


వైఎస్ షర్మిల కాళేశ్వరం పేరుతో ఎత్తిపోతల నీళ్ళు సముద్రంలో పోసి తొమ్మిది వేల కోట్ల కరెంటు బిల్లులను ఇప్పుడు జనం నెత్తిన రుద్దుతున్నారు అని మండిపడ్డారు. కెసిఆర్ స్వార్థ పాలనకు తెలంగాణ ప్రజల మీద మొత్తంగా చూస్తే 17 వేల కోట్ల విద్యుత్ బకాయిల భారం పడుతుందని లెక్కలు చెప్పారు. నమ్మి ఓటు వేసినందుకు ప్రజల నెత్తి మీద ఇంత భారం మోపుతావా అంటూ కేసీఆర్ సర్కార్ పై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు.2014లో ఇరిగేషన్ శాఖ విద్యుత్ బకాయిలు రూ.107కోట్లు అయితే 2020 నాటికి రూ.9268 కోట్లకు పెరిగిందని పేర్కొన్న షర్మిల కేసీఆర్ హయాంలో విద్యుత్ రంగం నాశనం అయ్యిందన్నారు.

షర్మిల అలా చెప్తే మంత్రి ఇలా చెప్తున్నారేంటి?

షర్మిల అలా చెప్తే మంత్రి ఇలా చెప్తున్నారేంటి?


ఇక వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ ను రాష్ట్రంలో కరెంటు బిల్లుల పేరుతో ప్రజలను బాదుతున్నారని టార్గెట్ చూస్తే, అసలు విద్యుత్ రంగంపై కేసీఆర్ కు ఉన్న పట్టు మరెవ్వరికీ లేదని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణం గా మారింది. వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితి లెక్కలతో సహా చెప్పి.. ఇదేం పాలన అని ప్రశ్నిస్తే, సీఎం కేసీఆర్ కు రాష్ట్రంలో ఇంధన పొదుపు పురస్కారం మొదట ఆయనకే ఇవ్వాలని మంత్రి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తెలంగాణ మంత్రులు వాస్తవాలను పక్కన పెట్టి, కెసిఆర్ మెప్పు పొందడం కోసం నేల విడిచి సాము చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది.

English summary
Minister Jagdish Reddy commented that KCR has done his PhD in the field of electricity. But YS Sharmila's comments saying that the electricity industry has been destroyed because of KCR and the current bills burden on public
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X