వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలసానీ.. నీకు చెంచాగిరి అలవాటే.. దమ్ముంటే ఈ పని కేసీఆర్‌తో చేయించు: జగ్గారెడ్డి సవాల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తలసాని వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. నీకు హైదరాబాద్‌లోనే పహిల్వాన్లు ఉన్నారేమో.. మాకు రాష్ట్రమంతా ఉన్నారని అన్నారు. జగ్గారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు.

తలసానీ.. నీ దమ్ము నిరూపించుకో..

తలసానీ.. నీ దమ్ము నిరూపించుకో..

‘నువ్వు ప్రజల కోసం కాకుండా కేసీఆర్ కుటుంబం కోసం పనిచేస్తున్నావు. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్పించి నీ దమ్ము నిరూపించుకో' అంటూ తలసానికి జగ్గారెడ్డి సవాల్ విసిరారు. కరోనా వైద్యం కోసం ఆరోగ్యశ్రీకి రూ. 10వేల కోట్లు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. తలసాని కుటుంబంలో ఎవరికైనా కరోనా వచ్చి ప్రాణ నష్టం జరిగితే ప్రజల బాధ ఏంటో తెలుస్తుందని జగ్గారెడ్డి అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నట్లు జీవో రాకపోతే హైదరాబాద్‌లో ఒక రోజు దీక్ష చేస్తానని అన్నారు. అయిన ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే హైదరాబాద్ కేంద్రం రోజూ ఓ కార్యక్రమం చేపడతామని అన్నారు.

తలసానీ.. నీకు చెంచాగిరి అలవాటే కానీ..

తలసానీ.. నీకు చెంచాగిరి అలవాటే కానీ..


ప్రజల కోసం చేయాలనుకుంటే గాంధీ ఆస్పత్రికి కేసీఆర్‌తో రూ .3వేల కోట్లు ఇప్పించేలా చొరవ తీసుకోవాలని అన్నారు. తలసాని టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్, హరీశ్ రావుని ఉరికించి కొడతానని అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్‌లో చంద్రబాబును ఉరికించి కొడతానని అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఏ పార్టీలో ఉంటే వారికి చెంచాగిరి చేయడం తలసానికి అలవాటు అయిపోయిందని వ్యాఖ్యానించారు.

Recommended Video

TSRTC Samme : కార్మికులు విధులకు పోతామంటే అన్ని పార్టీలలాగే సమర్ధించాము !
టీఆర్ఎస్ పార్టీకి జగ్గారెడ్డి హెచ్చరిక

టీఆర్ఎస్ పార్టీకి జగ్గారెడ్డి హెచ్చరిక


టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై అనవసరంగా నోరుపారేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని జగ్గారెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ కొత్త సచివాలయాన్ని తన పేరు ప్రఖ్యాతుల కోసమే కట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల డబ్బు రూ. 500 కోట్లు వృథా చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.కాగా, గురువారం తలసాని మాట్లాడుతూ.. 'సీఎం కనిపించకపోతే పాలన ఆగిందా.. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఆగాయా...?' అని ప్రశ్నించారు. ఎక్కడినుంచైనా పరిపాలన చేసే సౌలభ్యం మనకు ఉందన్నారు. పాలనలో భాగంగా ప్రభుత్వం కొత్త సచివాలయం కడితే తప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్ర గౌరవానికి తగ్గట్లు సచివాలయం ఉంటే తప్పా అని నిలదీశారు. వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం(జూలై 8) ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.

English summary
Jagga Reddy fires at minister talasani srinivas yadav
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X